క్రీడాభూమి

‘్ఫనిషింగ్’ కష్టమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాంచీ, అక్టోబర్ 27: క్రీజ్‌లో నిలబడి, వేగంగా పరుగులు రాబట్టి, లక్ష్యాన్ని ఛేదించడం అనుకున్నంత సులభం కాదని భారత వనే్డ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వ్యాఖ్యానించాడు. ఎన్నో కీలక సమయాల్లో టీమిండియాకు చిరస్మరణీయ విజయాలను అందించిన ధోనీకి ‘బెస్ట్ ఫినిషర్’ అన్న పేరు ఉంది. కానీ, కొంతకాలంగా అతను విఫలం కావడం విమర్శలకు తావిస్తున్నది. న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వనే్డలో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి, పదకొండు పరుగులకే అవుట్‌కావడంతో అతని ఫామ్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయాన్ని విశాఖ బయలుదేరే ముందు బిర్సా ముండా విమానాశ్రయంలో విలేఖరులతో మాట్లాడుతూ అతను ప్రస్తావించాడు. రాంచీ పిచ్‌పై పరుగులు రాబట్టడం కష్టమైందని అన్నాడు. ప్రతిసారీ మ్యాచ్‌ని గెలిపించడం చాలా కష్టమని చెప్పాడు. ‘్ఫనిషింగ్’ చాలా కష్టమని, లోయర్ మిడిల్ ఆర్డర్‌లో వేగంగా పరుగులు రాబట్టగల వారు చాలా తక్కువ మంది ఉంటారని పేర్కొన్నాడు. వైఫల్యాలు ఎవరికైనా సహజమేనని, తగినంత సమయమిస్తే మళ్లీ ఫామ్‌లోకి రావడం సాధ్యమవుతుందని చెప్పాడు. విరాట్ కోహ్లీపై భారత జట్టు ఎక్కువగా ఆధారపడిందన్న వాదనను ధోనీ తోసిపుచ్చాడు. కోహ్లీ కీలక ఆటగాడని, అయితే, జట్టును గెలిపించే సత్తా ఉన్న ఆటగాళ్లు జట్టులో ఉన్నారని చెప్పాడు.

చిత్రం.. విశాఖలో భారత కెప్టెన్ ధోనీ