క్రీడాభూమి

మరో చరిత్రకు పాక్‌సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షార్జా, అక్టోబర్ 29: వెస్టిండీస్‌ను వనే్డ, టి-20 సిరీస్‌ల్లో చిత్తుచేసి, టెస్టు సిరీస్‌ను కూడా ఇప్పటికే కైవసం చేసుకున్న పాకిస్తాన్ సరికొత్త చరిత్రను సృష్టించేందుకు సిద్ధమవుతున్నది. మూడు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌ను 3-0, అనే్న మ్యాచ్‌లున్న టి-20 సిరీస్‌ను అదే తేడాతో గెల్చుకున్న పాకిస్తాన్ మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా జరిగిన రెండు టెస్టుల్లోనూ గెలుపొంది, సిరీస్‌ను తన ఖాతాలో వేసుకుంది. చివరిదైన మూడో టెస్టు ఆదివారం నుంచి మొదలవుతుంది. ఆ టెస్టును కూడా గెల్చుకుంటే, వరుసగా మూడు సిరీస్‌ల్లో 9-0 తేడాతో చిత్తుచేసిన తొలి జట్టుగా మరో చరిత్రకు శ్రీకారం చుడుతుంది. క్రికెట్‌లో ఇప్పటి వరకూ ఏ జట్టుకూ రెండు లేదా మూడు సిరీస్‌ల్లో ఇంతటి ఆధిక్యంతో విజయం సాధ్యం కాలేదు. మహామహా జట్లు సాధించలేకపోయిన అరుదైన ఘనతను సొంతం చేసుకోవడానికి పాక్ సేన సిద్ధమైంది. చివరి టెస్టును కూడా గెలుస్తామని ఆ జట్టు కెప్టెన్ మిస్మా ఉల్ హక్ ధీమా వ్యక్తం చేస్తుంటే, ప్రత్యర్థి దూకుడుకు కళ్లెం వేస్తామని వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ అంటున్నాడు.