క్రీడాభూమి

భారత మహిళా క్రికెట్ జట్టులో మేఘనకు చోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), అక్టోబర్ 31: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన ఎస్ మేఘన భారత మహిళా క్రికెట్ జట్టుకు ఎంపికైంది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌విమన్‌గా, మీడియం పేసర్‌గా గత ఆరు సీజన్లలో విశేష ప్రతిభ కనబర్చిన మేఘన వెస్టిండీస్‌తో జరిగే సిరీస్‌లో పాల్గొనే భారత టి-20 జట్టులో స్థానం పొందింది. నవంబర్ 18 నుంచి వెస్టిండీస్‌తో సిరీస్‌లో మేఘన ఆడనుంది. ఆసియా కప్ టోర్నమెంట్‌కు ఎంపికైన జట్టులోనూ ఆమె స్థానం సంపాదించింది. అయతే, వనే్డ జట్టులో మేఘనకు చోటు దక్కలేదు. ఇలావుంటే, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన వారిలో మేఘన మూడో క్రికెటర్. ఇప్పటికే ఎసిఎ నుంచి స్నేహా దీప్తి, కల్పన భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. కాగా, వెస్టిండీస్‌తో భారత మహిళల జట్టు మూడు వనే్డ ఇంటర్నేషనల్స్, మరో మూడు టి-20 మ్యాచ్‌లను విజయవాడలో ఆడుతుంది. వనే్డలు వరుసగా 10, 13, 16 తేదీల్లో జరుగుతాయ. టి-20 ఇంటర్నేషనల్స్ 18, 20, 22 తేదీల్లో ఉంటాయ. వనే్డ జట్టుకు హైదరాబాదీ మిథాలీ రాజ్ నాయకత్వం వహిస్తుంది. టి-20 ఫార్మాట్‌లో జట్టుకు హర్‌మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా సేవలు అందిస్తుంది.