క్రీడాభూమి

బ్రాత్‌వైట్ అజేయ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షార్జా, నవంబర్ 1: పాకిస్తాన్‌తో తటస్థ వేదిక షార్జాలో జరుగుతున్న మూడో టెస్టు క్రికెట్ మ్యాచ్‌లో వెస్టిండీస్ ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ అజేయ శతకంతో రాణించాడు. దీంతో కరీబియన్లకు తొలి ఇన్నింగ్స్‌లో 56 పరుగుల ఆధిక్యత లభించింది. 6 వికెట్ల నష్టానికి 244 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో మంగళవారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన వెస్టిండీస్ జట్టుకు నైట్ వాచ్‌మన్లు బ్రాత్‌వైట్, జాసన్ హోల్డర్ 19 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అనంతరం కెప్టెన్ హోల్డర్ (16) మహమ్మద్ అమీర్ బౌలింగ్‌లో నిష్క్రమించినప్పటికీ దేవేంద్ర బిషూ (27)తో కలసి 8వ వికెట్‌కు 60 పరుగులు, అల్జారీ జోసఫ్ (6)తో కలసి 9వ వికెట్‌కు మరో 10 పరుగులు జోడించిన బ్రాత్‌వైట్ 142 పరుగులతో వ్యక్తిగత స్కోరుతో అజేయంగా నిలువగా, టెయిలెండర్ షానన్ గాబ్రియెల్ పరుగుల ఖాతా ఆరంభించకుండానే పెవిలియన్‌కు చేరాడు. దీంతో మొత్తం మీద 115.4 ఓవర్లలో 337 పరుగులకు ఆలౌటైన వెస్టిండీస్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 56 పరుగుల ఆధిక్యత సాధించింది.
అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ జట్టును విండీస్ బౌలర్లు సమర్ధవంతంగా ప్రతిఘటించారు. ముఖ్యంగా జాసన్ హోల్డర్ 10 పరుగులకే 3 వికెట్లు కైవసం చేసుకుని పాక్ వెన్ను విరవగా, రోస్టన్ ఛేజ్ 39 పరుగులిచ్చి ఒక వికెట్ రాబట్టాడు. వీరి జోరును ప్రతిఘటించడంలో ఘోరంగా విఫలమైన పాక్ జట్టులో ఓపెనర్ సమీ అస్లామ్ (17)తో పాటు అసద్ షఫిక్ (0), యూనిస్ ఖాన్ (0), కెప్టెన్ మిస్బా ఉల్‌హక్ (4) త్వరత్వరగా పెవిలియన్‌కు పరుగెత్తగా, నాన్‌స్ట్రైకింగ్ ఓపెనర్ అజర్ అలీ (45), వికెట్ కీపర్ సర్‌ఫ్రాజ్ అహ్మద్ (19) అజేయంగా నిలిచారు. దీంతో మూడో రోజు ఆట ముగిసే సమయానికి పాక్ జట్టు 39 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 87 పరుగులు రాబట్టింది. తొలి ఇన్నింగ్స్‌లో పాక్ 281 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.

క్రెయిగ్ బ్రాత్‌వైట్ (142-నాటౌట్)