క్రీడాభూమి

మహిళల ఎసిటిలో భారత్ జైత్రయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగపూర్, నవంబర్ 1: ఆసియా చాంపియన్స్ ట్రోఫీ (ఎసిటి) మహిళల హాకీ టోర్నమెంట్‌లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. మంగళవారం ఇక్కడ జరిగిన మూడవ పూల్ మ్యాచ్‌లో భారత జట్టు 2-0 గోల్స్ తేడాతో సింగపూర్ జట్టును మట్టికరిపించి అప్రతిహతంగా మరో విజయాన్ని నమోదు చేసుకుంది. మ్యాచ్ ప్రారంభమైన 7 నిమిషాలకే పూనమ్ రాణి అద్భుతమైన ఫీల్డ్ గోల్‌తో భారత జట్టుకు శుభారంభాన్ని అందించగా, ద్వితీయార్థంలో మరింత విజృంభించిన భారత జట్టుకు 45వ నిమిషంలో దీపిక పెనాల్టీ కార్నర్ ద్వారా మరో గోల్‌ను అందించింది. దీంతో ఆమె ఈ టోర్నీలో అత్యధిక గోల్స్ సాధించిన క్రీడాకారిణిగా అవతరించింది. ఆ తర్వాత గోల్ కోసం మలేసియా క్రీడాకారిణులు ఎంతగానో ప్రయత్నించినప్పటికీ గోల్‌కీపర్ రజనీ సమర్ధవంతంగా ప్రతిఘటించి భారత జట్టు 2-0 గోల్స్ తేడాతో విజయం సాధించడంలో తన వంతు పాత్ర పోషించింది. ఈ విజయంతో కలిపి మొత్తం 7 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా కొరియా, చైనా, జపాన్, మలేసియా కంటే ఎంతో ముందంజలో కొనసాగుతున్న భారత జట్టు 4వ తేదీన చైనాతో తలపడనుంది.
ఆ ట్రోఫీ మన జవాన్లకు అంకితం : శ్రీజేష్
బెంగళూరు: ఇదిలావుంటే, ఆసియా చాంపియన్స్ ట్రోఫీ పురుషుల హాకీ టోర్నీ ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై తాము సాధించిన విజయాన్ని ఇటీవల ఉరీ ఉగ్రదాడిలో అమరులైన భారత జవాన్లకు అంకితమిస్తున్నట్లు భారత జట్టు కెప్టెన్ పిఆర్.శ్రీజేష్ మంగళవారం ప్రకటించాడు. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమర జవాన్ల కుటుంబ సభ్యులకు దీపావళి కానుకగా తమ విజయాన్ని అంకితమిస్తున్నట్లు అతను తెలిపాడు. ‘ఆసియా చాంపియన్స్ ట్రోఫీ టోర్నీలో సాధించిన విజయాన్ని భారత సైనికులకు దీపావళి కానుకగా సమర్పిస్తున్నాం. దేశ సరిహద్దులను కాపాడుతున్న మన జవాన్లు ఈ ట్రోఫీని చూసి అందరి కంటే ఎక్కువగా సంతోషిస్తారు’ అని శ్రీజేష్ కౌలాలంపూర్ నుంచి బెంగళూరుకు చేరుకున్న అనంతరం విలేఖర్లతో అన్నాడు. ఆసియా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో పాక్ జట్టును ఓడించిన అనంతరం నిక్కిన్ తిమ్మయ్య, ఇతర సహచర ఆటగాళ్లతో కలసి శ్రీజేష్ సోమవారం రాత్రి 11.45 గంటలకు బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అయితే ప్రస్తుతం గాయంతో బాధపడుతున్న తాను ఈ నెల 23వ తేదీ నుంచి ఆస్ట్రేలియాలో ప్రారంభమయ్యే భారత జట్టు పర్యటనలో పాల్గొంటానా? లేదా? అనే విషయాన్ని ఇప్పుడే కచ్చితంగా చెప్పలేనని శ్రీజేష్ స్పష్టం చేశాడు.