క్రీడాభూమి

చర్చకు వచ్చిన స్టువర్ట్ పేరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి: ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ పేరు జాతీయ సెలక్షన్ కమిటీ సమావేశం చర్చకు వచ్చింది. అయితే, అతని కంటే హార్దిక్ పాండ్యను మెరుగైన ఆల్‌రౌండర్‌గా సెలక్టర్లు భావించారు. హార్దిక్ ఎక్కువ సంఖ్యలో ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడకపోయినా, అతను మంచి ఫామ్‌లో ఉన్నాడని చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ తమ ఎంపికను సమర్థించుకున్నాడు. స్టువర్ట్ పేరు చర్చకు వచ్చిందని, కానీ, సెలక్టర్లు హార్దిక్‌వైపే మొగ్గు చూపారని అన్నాడు. సమర్ధంగా పేస్ బౌలింగ్ చేయగల సరైన ఆల్‌రౌండర్ కోసం చాలాకాలంగా వెతుకుతున్నామని, హార్దిక్ రూపంలో తాము కోరుకున్న ఆటగాడు లభించాడని ఎమ్మెస్కే పేర్కొన్నాడు. భారత్ ‘ఎ’ జట్టు సభ్యుడిగా ఆస్ట్రేలియాలో పర్యటించిన తర్వాత హార్దిక్ బంతుల్లో వేగం పెరిగిందని చెప్పాడు. అంతేగాక, వికెట్‌కు ఇరువైపులా బంతిని స్వింగ్ చేయగలుగుతున్నాడని అన్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన వనే్డ సిరీస్‌తో అంతర్జాతీయ కెరీర్‌ను ఆరంభించిన అతను బౌలర్‌గా, బ్యాట్స్‌మన్‌గా, ఫీల్డర్‌గా తనను తాను నిరూపించుకున్నాడని ఎమ్మెస్కే చెప్పాడు. భారత ‘ఎ’ జట్టు సెలక్టర్ రాహుల్ ద్రవిడ్ కూడా హార్దిక్ సామర్థ్యాన్ని మెచ్చుకున్నాడని అన్నాడు. స్టువర్ట్ కంటే హార్దిక్‌ను మేలైన ఆల్‌రౌండర్‌గా ఎమ్మెస్కే అభివర్ణించాడు.
కరుణ్ నాయర్ ఎంపిక సబబే
కరుణ్ నాయర్‌ను స్టాండ్‌బై బ్యాట్స్‌మన్‌గా ఎంపిక చేయడం సబబేనని ఎమ్మెస్కే స్పష్టం చేశాడు. సుమారు రెండేళ్లుగా అతనిని ఉత్తమ బ్యాట్స్‌మన్‌గా తీర్చిదిద్దుతున్నామని చెప్పాడు. భారత బ్యాటింగ్ విభాగాన్ని బలోపేతం చేసే సత్తా అతనికి ఉంది కాబట్టే స్థానం కల్పించామని చెప్పాడు.
వైస్ కెప్టెన్‌గా రహానే
ఆజింక్య రహానేను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశామని ఎమ్మెస్కే అన్నాడు. ఏదైనా కారణం వల్ల కోహ్లీ మైదానంలోకి దిగలేకపోతే, అతని స్థానంలో రహానే టీమిండియా సారథ్య బాధ్యతలను స్వీకరిస్తాడని చెప్పాడు. యువరాజ్ సింగ్ పేరు కూడా చర్చకు వచ్చిందని అన్నాడు. ఇటీవల రంజీ ట్రోఫీలో యువీ అసాధారణ ప్రతిభ కనబరుస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని విలేఖరులు ప్రస్తావించగా, యువీ పేరును సెలక్షన్ కమిటీ సమావేశంలో చర్చించామన్నాడు. కానీ, ఎక్కువ మంది సెలక్టర్లు అతని పట్ల సుముఖత వ్యక్తం చేయలేదని తెలిపాడు.

చర్చించిన తర్వాతే నిర్ణయాలు
ముంబయి: చాలా మంది పేర్లను పరిశీలించి, వారి ప్రతిభాపాటవాలను విశే్లషించి, క్షుణ్ణంగా చర్చించిన తర్వాతే నిర్ణయాలు తీసుకున్నామని జాతీయ సెలక్షన్ కమిటీ చైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ స్పష్టం చేశాడు. సుమారు రెండేళ్ల విరామం తర్వాత గౌతం గంభీర్‌కు న్యూజిలాండ్ సిరీస్‌లో అవకాశం ఇవ్వడాన్ని అతను పూర్తిగా సమర్థించుకున్నాడు. కివీస్‌తో జరిగిన మొదటి టెస్టులో లోకేష్ రాహుల్, రెండో టెస్టులో శిఖర్ ధావన్ గాయపడడంతో మూడో టెస్టులో గంభీర్ బరిలోకి దిగాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 29 పరుగులు చేసిన అతను రెండో ఇన్నింగ్స్‌లో 50 పరుగులు సాధించాడు. ఈ విషయాన్ని ఎమ్మెస్కే ప్రస్తావిస్తూ, అన్ని కోణాల్లోనూ క్షుణ్ణంగా చర్చించిన తర్వాత ఎవరినైనా జాతీయ జట్టులోకి తీసుకుంటామని అన్నాడు. ఎంపిక చేసిన వారికి సరైన అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం కూడా ఉందని చెప్పాడు.