క్రీడాభూమి

గెలుపు గుర్రాలను గుర్తించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 2: టోక్యోలో జరిగే 2020 ఒలింపిక్స్‌లో పతకాలు సాధించే సత్తా ఉన్న వారిని గుర్తించాలని జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్‌ఎఫ్‌ఎస్)లకు కేంద్రం సూచించింది. రియో ఒలింపిక్స్‌లో ఎన్నో అంచనాలతో భారీ బృందాన్ని పంపిపన్పటికీ భారత్ కేవలం రెండు పతకాలతో సంతృప్తి చెందిన విషయం తెలిసిందే. బాడ్మింటన్‌లో పివి సింధు రజత పతకాన్ని గెల్చుకోగా, రెజ్లింగ్‌లో సాక్షి మాలిక్ కాంస్యాన్ని సాధించింది. వీరి విజయాల పట్ల హర్షం వ్యక్తమైనప్పటికీ, రియోకు వెళ్లిన మిగతా 117 మంది రిక్త హస్తాలతో తిరిగి రావడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చెలరేగాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంపై ఘాటుగానే స్పందించింది. భవిష్యత్తులో భారత్‌కు ఎక్కువ సంఖ్యలో పతకాలు దక్కించుకోవడానికి మార్గాలను సూచించేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటును ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖకు ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. ఎన్‌ఎఫ్‌ఎస్ అధికారులతో రెండు దఫాలు చర్చలు జరిపిన క్రీడా మంత్రిత్వ శాఖ ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో గెలుపు గుర్రాలను గుర్తించే బాధ్యతను ఎన్‌ఎఫ్‌ఎస్‌లకు అప్పగించింది. సామర్థ్యం ఉన్న వారిని ఎంపిక చేసి, వారికి ఇప్పటి నుంచే శిక్షణనిప్పించాలని యోచిస్తున్నది. మాజీ క్రీడాకారులు, అధికారుల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటున్నది. వారితో సమావేశమై చర్చలు జరుపుతున్నది. కేం ద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయల్ స్వయంగా ఈ కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ, అవసరమైన సూచనలు చేస్తున్నాడు. సమర్థులను ఎన్‌ఎఫ్‌ఎస్‌లు ఎంపిక చేసిన వెంటనే ఆయన ఒక క్రీయాశీలక వ్యూహాన్ని, లక్ష్యాన్ని అందుకోవడానికి అ నుసరించాల్సిన మార్గాలపై విధివిధానాలను ప్రకటించే అవకాశం ఉంది.