క్రీడాభూమి

సెంచరీ చేరువలో జిజో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వార్సా, నవంబర్ 2: సాకర్ ప్రపంచంలో ‘జిజో’గా సుపరచితుడైన ఫ్రెంచ్ మాజీ సూపర్ స్టార్ జినెదిన్ జిదానే సెంచరీకి ఒక మ్యాచ్ దూరంలో ఉన్నాడు. అంతర్జాతీయ కెరీర్‌ను ముగించిన తర్వాత అతను కోచ్‌గా కొత్త ఇన్నింగ్స్ ఆరంభించాడు. ప్రస్తుతం రియల్ మాడ్రిడ్‌కు మార్గదర్శకం చేస్తున్నాడు. చాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్‌లో భాగంగా గురువారం లెగియా వార్సాతో రియల్ మాడ్రిడ్ తలపడే మ్యాచ్‌తో అతను అరుదైన మైలురాయిని చేరుకోనున్నాడు. కోచ్‌గా ఇప్పటికి 99 మ్యాచ్‌లను పూర్తి చేసుకున్న అతనికి ఇది వందో మ్యాచ్ అవుతుంది. ఇటీవలే రియల్ మాడ్రిడ్‌కు 11వ సారి యూరోపియన్ కప్‌ను సాధించిపెట్టిన జిదానే కోచ్‌గా తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు. ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకూ రియల్ మాడ్రిడ్ ఒక్క పరాజయం కూడా కూడా లేకుండా 26 మ్యాచ్‌లు ఆడింది. జిదానే ప్రతిభకు ఇదే నిదర్శనం. కోచ్ హోదాలో వందో మ్యాచ్ ఆడుతున్న అతనికి పలువురు సాకర్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.