క్రీడాభూమి

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్ హార్దిక్‌కు చోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, నవంబర్ 2: ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య టెస్టు క్రికెట్‌లోకి అడుగుపెట్టనున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో మొదటి రెండు టెస్టులకు ఎంపిక చేసిన జట్టులో అతనికి స్థానం లభించింది. చికున్‌గున్యా బారిన పడి కోలుకున్న ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మకు మళ్లీ జట్టులో చోటు దక్కింది. చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ అధ్యక్షతన బుధవారం సమావేశమైన సెలక్టర్లు వెటరన్ బ్యాట్స్‌మన్ గౌతం గంభీర్‌పై నమ్మకం ఉంచారు. సుమారు రెండేళ్ల విరామం తర్వాత న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో గంభీర్ తిరిగి జాతీయ జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇండోర్ టెస్టులో అతను అర్ధ శతకం సాధించి ఫామ్‌ను నిరూపించుకున్నాడు. అందుకే సెలక్టర్లు అతనికి మరో అవకాశం ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేశారు. రెగ్యులర్ స్పిన్నర్లుగా రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అమిత్ మిశ్రా సేవలు అందిస్తారు. నాలుగో స్పిన్నర్ రూపంలో జయంత్ యాదవ్‌ను సెలక్టర్లు తీసుకున్నారు. అదేవిధంగా 15 మంది సభ్యులతో కూడిన జట్టులో కరుణ్ నాయర్‌ను రిజర్వ్‌డ్ బ్యాట్స్‌మన్‌గా ఎంపిక చేశారు. ఫాస్ట్ బౌలర్లు మహమ్మద్ షమీ, ఉమేష్ యాదవ్ తమ స్థానాలను పదిలం చేసుకున్నారు. ఆజింక్య రహానే, చటేశ్వర్ పుజారా, మురళీ విజయ్ ఎలాంటి ఇబ్బంది లేకుండా జట్టులోకి వచ్చారు.
జట్టు వివరాలు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), మురళీ విజయ్, గౌతం గంభీర్, ఆజింక్య రహానే (వైస్ కెప్టెన్), చటేశ్వర్ పుజారా, కరుణ్ నాయర్, హార్దిక్ పాండ్య, వృద్ధిమాన్ సాహా (వికెట్‌కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అమిత్ మిశ్రా, ఉమేష్ యాదవ్, ఇశాంత్ శర్మ, మహమ్మద్ షమీ, జయంత్ యాదవ్.