క్రీడాభూమి

బెంగళూరుకు ఉజ్వల భవిష్యత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దోహా, నవంబర్ 3: బెంగళూరు ఫుట్‌బాల్ క్లబ్‌కు ఉజ్వల భవిష్యత్తు ఉందని ఆ జట్టు మాజీ కోచ్ ఆష్లే వెస్ట్‌వుడ్ జోస్యం చెప్పాడు. ఆసియా ఫుట్‌బాల్ కానె్ఫడరేషన్ (ఎఎఫ్‌సి) కప్ ఫైనల్ చేరిన తొలి భారత జట్టుగా రికార్డు సృష్టించిన బెంగళూరు ఆటగాళ్లు ఇక్కడికి చేరుకున్నప్పుడు ఘనస్వాగతం లభించింది. సునీల్ చత్రీ నాయకత్వంలోని బెంగళూరు జట్టుతో ఫొటోలు దిగేందుకు పోటీపడ్డారు. శనివారం జరిగే ఫైనల్‌లో ఇరాక్‌కు చెందిన అల్ కువా అల్ జవియాను ఢీకొంటున్న బెంగళూరు జట్టు గట్టిపోటీనిస్తుందని వెస్ట్‌వుడ్ విలేఖరులతో మాట్లాడుతూ అన్నాడు. ఎఎఫ్‌సి కప్ ఫైనల్‌కు చేరడమే ఆ జట్టు ప్రతిభకు నిదర్శనమని చెప్పాడు. బెంగళూరు సాధించిన ప్రగతి భారత దేశంలో ఫుట్‌బాల్ అభివృద్ధికి బాటలు వేస్తుందని అన్నాడు. విజయం ఎవరిని వరిస్తుందనేది ఎవరూ చెప్పలేరని, అయితే, ఫైనల్ పోరు హోరాహోరీగా సాగుతుందనడంలో అనుమానం లేదని వెస్ట్‌వుడ్ అన్నాడు.