క్రీడాభూమి

వచ్చే నెల 9న ఇశాంత్ పెళ్లి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారణాసి, నవంబర్ 3: భారత ఫాస్ట్ బౌలర్ ఇశాంత్ శర్మ వచ్చే నెల 9న ఒక ఇంటివాడు కానున్నాడు. బాస్కెట్‌బాల్ క్రీడాకారిణి ప్రతిమా సింగ్‌తో అతని వివాహం జరుగుతుంది. ఈ ఏడాది జూన్ 19న వీరి నిశ్చితార్థం జరగ్గా, వివాహ తేదీని ఇరు కుటుంబాల పెద్దలు ఖరారు చేశారు. వారణాసికి చెందిన ప్రతిమ ఆసియా గేమ్స్‌సహా పలు అంతర్జాతీయ బాస్కెట్‌బాల్ పోటీల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించింది. కెప్టెన్‌గా కూడా సేవలు అందించింది. ఆమె నలుగురు అక్కలు కూడా బాస్కెట్‌బాల్ క్రీడారిణులే. ‘సింగ్ సిస్టర్స్’గా భారత బాస్కెట్‌బాల్ అభిమానులకు సుపరచితులైన క్రీడాకారిణుల్లో ప్రతిమ అందరి కంటే చిన్నది.

ఇశాంత్, ప్రతిమ నిశ్చితార్ధం నాటి చిత్రం