క్రీడాభూమి

భారత్‌కు టైటిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగపూర్, నవంబర్ 5: ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీలో విజేతగా నిలిచిన పురుషుల జట్టును చూసి స్ఫూర్తి పొందినట్టు కనిపిస్తున్న భారత మహిళల జట్టు టైటిల్ కైవసం చేసుకుంది. శనివారం జరిగిన ఫైనల్‌లో ఈ జట్టు 2-1 ఆధిక్యంతో చైనాను ఓడించి, మొదటిసారి టైటిల్‌ను అందుకుంది. చివరి వరకూ ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో 13వ నిమిషంలోనే దీప్ గ్రేస్ ఎక్కా ద్వారా భారత్ తొలి గోల్‌ను సంపాదించుకుంది. పెనాల్టీ కార్నర్‌ను ఆమె సద్వినియోగం చేసుకుంది. ఆతర్వాత భారత క్రీడాకారిణులు రక్షణాత్మకంగా ఆడగా, గోల్స్ కోసం చైనా ముమ్మర ప్రయత్నాలు ఆరంభించింది. చాలాసేపు భారత డిఫెన్స్‌ను ఛేదించలేకపోయిన చైనా చివరికి 44వ నిమిషంలో ఈక్వెలైజర్‌ను సాధించి ఊపిరి పీల్చుకుంది. 44వ నిమిషంలో జాంగ్ మెంగ్లిన్ ఫీల్డ్ గోల్ చేసి, చైనాకు విజయంపై ఆశలు రేపింది. స్కోరు సమమైన తర్వాత పోరు ఉద్ధృతమైనప్పటికీ, ఒకరి ప్రయత్నాలను మరొకరు అడ్డుకోవడంతో గోల్స్ నమోదు కాలేదు. నిర్ణీత సమయం ముగిసే వరకూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని, ఎక్‌స్ట్రా టైమ్ అనివార్యమవుతుందని అంతా అనుకున్నారు. కానీ, 60వ నిమిషంలో ఏస్ స్ట్రయికర్ దీప చేసిన గోల్ భారత్‌ను ఆధిక్యంలో నిలబెట్టడమేగాక, చిరస్మరణీయ విజయాన్ని సాధించిపెట్టింది.

చిత్రం.. మొట్టమొదటిసారి ఆసియా చాంపియన్స్ ట్రోఫీ మహిళల హాకీ టైటిల్‌ను సాధించిన భారత క్రీడాకారిణుల విక్టరీ ల్యాప్