క్రీడాభూమి

రెండో టెస్టులో ఆడతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌కోట్, నవంబర్ 10: భారత్‌తో ఈనెల 17 నుంచి విశాఖపట్నంలో మొదలయ్యే రెండో టెస్టులో ఆడతానని, అప్పటిలోగా పూర్తి ఫిట్నెస్‌ను సంపాదించుకుంటానని ఇంగ్లాండ్ సూపర్ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ ధీమా వ్యక్తం చేశాడు. పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ భుజం గాయం కారణంగా బంగ్లాదేశ్ టూర్‌లో పాల్గొనలేకపోయిన విషయాన్ని గుర్తుచేశాడు. భారత్‌తో మొదటి టెస్టులోనూ ఇదే కారణంగా ఆడలేదని చెప్పాడు. ఇప్పుడు పరిస్థితి మెరుగ్గా ఉందని, వచ్చే వారం జరిగే రెండో టెస్టులో తప్పకుండా ఆడతానన్న నమ్మకం తనకు ఉందని 34 ఏళ్ల ఆండర్సన్ అన్నాడు. రెండో మ్యాచ్ ప్రారంభమయ్యేలోగా పూర్తి ఫిట్నెస్‌ను సంపాదిస్తానని చెప్పాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఉన్న అనుభవంతో చాలా తక్కువ సమయంలోనే ఫిట్నెస్ సమస్యల నుంచి కోలుకోగలుగుతానని అన్నాడు. కెరీర్‌లో వందో టెస్టు ఆడుతున్న మరో ఫాస్ట్ బౌలర్ స్టువర్ట్ బ్రాడ్ గురించి ప్రస్తావిస్తూ, అతను ఇంత త్వరగా గాయం నుంచి బయటపడతానని అనుకోలేదన్నాడు. భారత్ టూర్‌కు రాడన్న అనుమానం కలిగిందని చెప్పాడు. కానీ, బ్రాత్ ఆత్మవిశ్వాసమే అతనిని టెస్టు సిరీస్‌కు సిద్ధం చేసిందని ఆండర్సన్ అన్నాడు.