క్రీడాభూమి

పెర్త్‌లో హోరాహోరీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెర్త్, జనవరి 11: పెర్త్‌లోని వెస్టర్న్ ఆస్ట్రేలియా క్రికెట్ సంఘం (వకా) మైదానం హోరాహోరీ పోరాటానికి వేదిక కానుంది. బలమైన జట్లు భారత్, ఆస్ట్రేలియా మంగళవారం నాటి మొదటి వనే్డ ఇంటర్నేషనల్‌కు సిద్ధంకాగా, ఫలితం ఎలావున్నా పోరు తీవ్ర స్థాయిలో సాగుతుందనేది వాస్తవం. మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని టీమిండియాకు గత ఏడాది అచ్చిరాలేదు. బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా జట్ల చేతిలో వనే్డ సిరీస్‌లను టీమిండియా కోల్పోవడంతో ధోనీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈఏడాదిని ఫలప్రదంగా ప్రారంభించాలనుకున్న అతనికి మొదట్లోనే ఆస్ట్రేలియా వంటి మేటి జట్టు నుంచి సవాలు ఎదురుకానుంది. మార్చి, ఏప్రిల్ మాసాల్లో స్వదేశంలో జరిగే టి-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ పోటీలను దృష్టిలో ఉంచుకొని, ఇప్పటి నుంచే పోరాటాలకు జట్టును సిద్ధం చేయాల్సిన బాధ్యత ధోనీపై ఉంది. అందుకే, ఆస్ట్రేలియా టూర్‌లో భాగంగా జరిగే ఐదు మ్యాచ్‌ల వనే్డ, మూడు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌లను అతను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాడు. అయితే, ఆస్ట్రేలియా జట్టును ఆస్ట్రేలియాలోనే ఓడించడం అనుకున్నంత సులభం కాదు. సర్వశక్తులతో యుద్ధానికి సన్నద్ధం కావాలి.
3:2 కాంబినేషన్
ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగాలన్నది ధోనీ ఆలోచన. అనుభవజ్ఞుడైన ఇశాంత్ శర్మ వెస్టర్న్ ఆస్ట్రేలియా ద్వితీయ శ్రేణి జట్టుతో జరిగిన రెండు వామప్ మ్యాచ్‌ల్లోనూ ఆడలేదు. ఆ మ్యాచ్‌ల్లో భారత్ గెలిచినా, ఆసీస్ జట్టుతో పోరాటానికి అవసరమైన ఆత్మవిశ్వాసం లభించలేదన్నది నిజం. అయితే, కనీస ప్రాక్టీస్ కూడా లేకుండా ఇశాంత్ ఏ విధంగా రాణిస్తాడన్నదే అనుమానం. పేసర్ బరీందర్ శరణ్ మంగళవారం నాటి మ్యాచ్‌తో అంతర్జాతీయ కెరీర్‌ను ఆరంభించే అవకాశాలున్నాయి. మూడో ఫాస్ట్ బౌలర్‌గా ఉమేష్ యాదవ్‌ను ఆడించడం ఖాయంగా కనిపిస్తున్నది. పేస్ బౌలింగ్‌కు నాయకత్వం వహించే సత్తావున్న మహమ్మద్ షమీ గాయం కారణంగా వైదొలగ్గా, అతని స్థానంలో జట్టులోకి వచ్చిన భువనేశ్వర్‌కు ప్లేయింగ్ ఎలెవెన్‌లో స్థానం దక్కకపోవచ్చు. ఇక స్పిన్నర్లుగా రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు ధోనీ అవకాశం ఇస్తాడన్నది పరిశీలకుల అభిప్రాయం. మొత్తం మీద ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో మ్యాచ్ ఆడతామని ధోనీ ప్రకటించడంతో, ఐదుగురు బౌలర్లతో టెస్టు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన ప్రయోగాన్ని ధోనీ కూడా కొనసాగిస్తాడన్నది స్పష్టమైంది. జట్టులో ఆల్‌రౌండర్లు ఎవరూ లేరని అతను చెప్పాడు. దీనిని బట్టి జడేజాను అతను స్పెషలిస్టు బౌలర్‌గానే భావిస్తున్నట్టు స్పష్టమవుతోంది.
బలమైన బ్యాటింగ్ లైనప్
బౌలింగ్ విభాగంతో పోలిస్తే టీమిండియా బ్యాటింగ్‌లో పటిష్టంగా కనిపిస్తున్నది. కెప్టెన్ ధోనీ స్వయంగా ఎన్నో మ్యాచ్‌లను ఒంటిచేత్తో గెలిపించాడు. శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, ఆజింక్య రహానే, విరాట్ కోహ్లీ మొదటి నాలుగు స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగితే, ధోనీ ఐదో స్థానంలో మైదానంలోకి వస్తాడు. కీలకమైన ఆరో స్థానంలో ఎవరు బ్యాటింగ్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ స్థానానికి మనీష్ పాండే, గుర్‌కీరత్ సింగ్ మాన్ పోటీపడుతున్నారు. సాధారణంగా ఈ స్థానాన్ని సురేష్ రైనా భర్తీ చేసేవాడు. కానీ, అతనికి వనే్డ జట్టులో స్థానం లభించలేదు. ఫలితంగా ఫిఫ్త్‌డౌన్ బ్యాట్స్‌మన్ ఎవరన్న ప్రశ్న ఉత్కంఠ రేపుతోంది. జింబాబ్వేపై గత ఏడాది తన కెరీర్‌లో తొలి వనే్డ ఆడిన మనీష్ పాండే సమర్థుడిగా పేరు తెచ్చుకున్నాడు. మొదటి ప్రాక్టీస్ గేమ్‌లో 58 పరుగులు సాధించి సత్తా చాటుకున్నాడు. గుర్‌కీరత్ పంజాబ్, భారత్ ‘ఎ’ జట్ల తరఫున నిలకడగా రాణిస్తూ సెలక్టర్లను ఆకట్టుకున్నాడు. ఉజ్వల భవిష్యత్తు ఉన్న బ్యాట్స్‌మెన్‌గా పేరుతెచ్చుకున్న వీరిద్దరిలో ఎవరి పట్ల ధోనీ మొగ్గు చూపుతాడో చూడాలి.
రిషీ ధావన్ అనుమానమే!
సీమర్ ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్న రిషీ ధావన్‌కు తుది జట్టులో స్థానం లభించడం అనుమానంగా మారింది. ఆస్ట్రేలియా పిచ్‌లు ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలిస్తాయికాబట్టి ఫాస్ట్ బౌలింగ్‌తో అతను జట్టుకు ఉత్తమ సేవలు అందించవచ్చు. అదే విధంగా, బ్యాటింగ్‌లోనూ అతను సమర్థుడే. ఈ లక్షణాలున్న ఎవరికైనా జట్టులో సులభంగానే స్థానం దక్కుతుంది. కానీ, ఆల్‌రౌండర్లు ప్లేయింగ్ లెవెన్‌లో లేరని ధోనీ ప్రకటించడమే రిషీ ధావన్‌కు అవకాశాలపై అనుమానాలను రేకెత్తిస్తున్నది.
ఊరటనిచ్చే అంశాలు
భారత కెప్టెన్ ధోనీకి ఊరటనిచ్చే అంశాలు లేకపోలేదు. వాటిలో ప్రధానమైనది డేవిడ్ వార్నర్ గాయపడడం. విధ్వంసకర బ్యాట్స్‌మన్‌గా ముద్రపడిన వార్నర్ ఇటీవల కాలంలో అసాధారణ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. అయితే, ఫిట్నెస్ సమస్యను ఎదుర్కొంటున్న అతను మంగళవారం నాటి మ్యాచ్‌కి అందుబాటులో ఉంటాడా అన్నది తెలియడం లేదు. ఒకవేళ అతను మ్యాచ్ ఆడకపోతే టీమిండియాకు ఊరట లభిస్తుంది. నిప్పులు చెరిగే బంతులతో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టే మిచెల్ జాన్సన్ క్రికెట్ నుంచి రిటైర్‌కావడం, మరో స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ కూడా సిరీస్‌కు అందుబాటులో లేకపోవడం టీమిండియాకు కలిసొచ్చే అంశాలు. ప్రతిభావంతులు లేనికారణంగా ఆస్ట్రేలియా బౌలింగ్ విభాగం వెలవెలబోతున్నది. ఈ అవకాశాన్ని భారత బ్యాట్స్‌మెన్ ఎంత వరకూ సద్వినియోగం చేసుకుంటారో చూడాలి. విదేశాల్లో ఒకటి (బంగ్లాదేశ్), స్వదేశంలో ఒకటి (దక్షిణాఫ్రికా) చొప్పున వరుసగా రెండు వనే్డ సిరీస్‌లను కోల్పోయిన టీమిండియా మళ్లీ ఫామ్‌లోకి రావాలన్నా, విమర్శల బారి నుంచి ధోనీ తప్పించుకోవాలన్నా ఆస్ట్రేలియాతో జరిగే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో గెలిచితీరాలి. ఈ పట్టుదలతోనే మంగళవారం నాటి తొలి మ్యాచ్‌కి టీమిండియా అస్తశ్రస్త్రాలను సిద్ధం చేసుకుంది.
(్భరత కాలమానం ప్రకారం మ్యాచ్
మంగళవారం ఉదయం 8.50 గంటలకు మొదలవుతుంది).

తొలి ద్వైపాక్షిక వనే్డ సిరీస్
ఆస్ట్రేలియాలో టీమిండియా మొట్టమొదటి ద్వైపాక్షిక సిరీస్‌లో ఆడనుంది. ఇప్పటి వరకూ ఆసీస్ జట్టుతో భారత్ ఆస్ట్రేలియాలో పలు వనే్డ మ్యాచ్‌లు ఆడింది. అయితే, అవి ఇతరత్రా టోర్నీల్లో భాగంగా జరిగే మ్యాచ్‌లే. ద్వైపాక్షిక సిరీస్ మాత్రం మొదటిసారి జరగనుంది.
31 పరాజయాలు
ఆస్ట్రేలియాలో ఆసీస్ జట్టుతో భారత్ ఇప్పటి వరకూ 10 విజయాలు సాధించి, 31 పరాజయాలను ఎదుర్కొంది. 2004లో మొదలుపెడితే, వరుసగా 11సార్లు ఓడింది. గత 11 వనే్డల్లో జయాపజయాల చిట్టాను పరిశీలిస్తే, భారత్ కేవలం నాలుగు మ్యాచ్‌లు గెల్చుకుంది.