క్రీడాభూమి

మూడో రోజు మరో రెండు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌కోట్, నవంబర్ 11: రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ స్టేడియంలో సెంచరీల హోరు మారుమోగుతున్నది. ఇంగ్లాండ్, భారత్‌తో జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ మూడో రోజున మరో రెండు శతకాలు నమోదయ్యాయి. ఇంగ్లాండ్ ఆటగాడు జో రూట్ (124) మొదటి రోజు, మోయిన్ అలీ (117), బెన్ స్టోక్స్ (128) రెండో రోజు సెంచరీలు సాధించిన విషయం తెలిసిందే. మూడో రోజు ఆటలో భారత బ్యాట్స్‌మెన్ మురళీ విజయ్, చటేశ్వర్ పుజారా శతకాలతో కదంతొక్కారు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ స్కోరు 537 పరుగులకు సమాధానంగా టీమిండియా మొదటి ఇన్నింగ్స్ ఆరంభించి, రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టం లేకుండా 63 పరుగులు చేసింది. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఉదయం ఆటను కొనసాగించి, మరో ఐదు పరుగులకే గౌతం గంభీర్ వికెట్‌ను కోల్పోయింది. అతను 72 బంతులు ఎదుర్కొని, 29 పరుగులు చేసి స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఎల్‌బిగా వెనుదిరిగాడు. అయితే, రెండో రోజు ఆట ఆరంభంలోనే వికెట్‌ను సాధించిన ఆనందం ఇంగ్లాండ్‌కు ఎంతోసేపు నిలవలేదు. ఓపెనర్ మరళీ విజయ్, ఫస్ట్‌డౌన్ ఆటగాడు చటేశ్వర్ పుజారా క్రీజ్‌లో పాతుకుపోయారు. బలమైన ఇంగ్లాండ్ బౌలింగ్‌కు దీటైన సమాధానమిస్తూ స్కోరును ముందుకు దూకించారు. రెండో వికెట్‌కు 209 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేసి, జట్టును ఆదుకున్నారు. 206 బంతులు ఎదుర్కొని, 17 ఫోర్ల సాయంతో 124 పరుగులు సాధించిన పుజారాను అలిస్టర్ కుక్ క్యాచ్ అందుకోగా బెన్ స్టోక్స్ అవుట్ చేశాడు. తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి విజయ్ భారత స్కోరును 300 పరుగుల మైలురాయిని దాటించాడు. తన మారథాన్ ఇన్నింగ్స్‌లో 301 బంతులు ఎదుర్కొని, 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 126 పరుగులు సాధించిన విజయ్ చివరికి అదిల్ రషీద్ బౌలింగ్‌లో హసీబ్ హమీద్‌కు చిక్కాడు. తర్వాతి ఓవర్ మూడో బంతికి అమిత్ మిశ్రా (0) వెనుదిరిగాడు. నైట్‌వాచ్‌మన్‌గా బ్యాటింగ్‌కు వచ్చిన మిశ్రాను జాఫర్ అన్సారీ ఓవర్‌లో హసీబ్ హమీద్ మరోసారి చక్కటి క్యాచ్ పట్టి వెనక్కు పంపాడు. మిశ్రా వికెట్ కూలిన వెంటనే మూడోరోజు ఆటను నిలిపివేశారు. భారత్ నాలుగు వికెట్లకు 319 పరుగులు సాధించగా, కోహ్లీ 26 పరుగులకో నాటౌట్‌గా ఉన్నాడు. ఇంగ్లాండ్ కంటే భారత్ ఇంకా 218 పరుగులు వెనుకంజలో ఉంది. అయితే, చేతిలో ఇంకా ఆరు వికెట్లు ఉన్నాయి కాబట్టి ఆందోళన చెందాల్సిన పరిస్థితి ఉండదని విశే్లషకుల అభిప్రాయం.
ఇలావుంటే, మన దేశంలో జరిగిన టెస్టుల్లో మొదటి ఇన్నింగ్స్‌లోనే ఐదు శతకాలు నమోదు కావడం ఇది ఆరో సారి. ఆరేసి సెంచరీలు నమోదైన టెస్టులు రెండు ఉన్నా య. 2003-04 సీజన్‌లో మొహాలీ టెస్టులో భారత్, న్యూ జిలాండ్ తలపడినప్పుడు ఒకసారి, 2009-10 సీజన్‌లో కో ల్‌కతాలో భారత్, దక్షిణాఫ్రికా జట్ల మ్యాచ్ మొదటి ఇ న్నింగ్స్‌లో మరోసారి ఆరేసి శతకాలు నమోదయ్యాయ. కా గా, మురళీ విజయ్ ఇంగ్లాండ్‌పై రెండో శతకాన్ని సాధించా డు. తొలి సెంచరీ అతను 2014లో నాటింహామ్‌లో జరిగిన టెస్టులో చేశాడు. అప్పుడు అతని స్కోరు 146 పరుగులు. విరాట్ కోహ్లీ నాయకత్వంలోని 14 టెస్టుల్లో విజయ్ సెంచ రీ చేయడం ఇది రెండోసారి. అతను స్వదేశంలో నాలుగు, విదేశాల్లో మూడు చొప్పున సెంచరీలు చేశాడు. పుజారాతో కలిసి అతను ఇప్పటి వరకూ టెస్టుల్లో రెండువేలకుపైగా పరుగుల భాగస్వామ్యాలను అందించాడు. భారత క్రికెట్ లో మరే ఇతర జోడీ ఈ ఘనతను అందుకోలేదు. వీరి స్కో రులో ఆరు శ తకాలు, 9 అర్ధ శతకాలు ఉన్నాయ. వీరు 32 ఇన్నింగ్స్‌లో 2,081 పరుగులు జోడించారు. రెండు వందల కు పైగా పార్ట్‌నర్‌షిప్‌ను సాధించడం వీరికి ఇది రెండోసారి.
స్కోరుబోర్డు
ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్: 159.3 ఓవర్లలో ఆలౌట్ 537 (జో రూట్ 124, మోయిన్ అలీ 117, బెన్ స్టోక్స్ 128, మహమ్మద్ షమీ 2/65, ఉమేష్ యాదవ్ 2/112, అశ్విన్ 2/167, రవీంద్ర జడేజా 3/86).
భారత్ మొదటి ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు వికెట్ నష్టం లేకుండా 63): మురళీ విజయ్ సి హసీబ్ హమీద్ బి అదిల్ రషీద్ 126, గౌతం గంభీర్ ఎల్‌బి స్టువర్ట్ బ్రాడ్ 29, చటేశ్వర్ పుజారా సి అలిస్టర్ కుక్ బి బెన్ స్టోక్స్ 124, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ 26, అమిత్ మిశ్రా సి హసీబ్ హమీద్ 0, ఎక్‌స్ట్రాలు 14, మొత్తం (108.3 ఓవర్లలో 4 వికెట్లకు) 319.
వికెట్ల పతనం: 1-68, 2-277, 3-318, 4-319.
బౌలింగ్: స్టువర్ట్ బ్రాడ్ 20-7-54-1, క్రిస్ వోక్స్ 23-5-39-0, మోయిన్ అలీ 22-6-70-0, జాఫర్ అన్సారీ 17.3-1-57-1, అదిల్ రషీద్ 16-1-47-1, బెన్ స్టోక్స్ 10-1-39-1.

నేమార్ హాఫ్ సెంచరీ!
బెలో హోరిజోనే్ట (బ్రెజిల్), నవంబర్ 11: వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ పోటీల్లో భాగంగా చిరకాల ప్రత్యర్థి అర్జెంటీనాను బ్రెజిల్ 3-0 తేడాతో ఓడించింది. స్టార్ ఆటగాడు నేమార్ తన కెరీర్‌లో చిరస్మరణీయ గోల్‌ను సాధించడం ఈ మ్యాచ్‌లో విశేషం. అంతర్జాతీయ కెరీర్‌లో నేమార్‌కు ఇది 74 మ్యాచ్‌ల్లో అతనికి ఇది యాభయ్యో గోల్. హాఫ్ సెంచరీ గోల్స్‌ను పూర్తి చేసిన అతను మైదానంలో గంతులు వేసి సంబరాలు చేసుకున్నాడు.