క్రీడాభూమి

కుప్పకూలిన ఆస్ట్రేలియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హోబట్, నవంబర్ 12: దక్షిణాఫ్రికాతో శనివారం ఇక్కడ ప్రారంభమైన రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా కేవలం 85 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ స్టీవెన్ స్మిత్ 48 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అతనితోపాటు జో మెన్నీ (10) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. మిగతా వారంతా సింగిల్ డిజిట్‌కే పెవిలియన్ చేయడంతో ఆసీస్ ఇన్నింగ్స్‌కు 32.5 ఓవర్లలోనే తెరపడింది. వెర్నన్ ఫిలాండర్ 21 పరుగులకే ఐదు వికెట్లు కూల్చాడు. కైల్ అబోట్ 41 పరుగులిచ్చి మూడు వికెట్లు కూల్చాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఐదు వికెట్లకు 171 పరుగులు చేసింది. టెంబా బవూమా (38), క్వింటన్ డికాక్ (28) క్రీజ్‌లో ఉన్నారు.
కాగా, 1978లో ఇంగ్లాండ్‌పై గబ్బా స్టేడియంలో 26 పరుగులకే ఆస్ట్రేలియా ఆరు వికెట్లు చేజార్చుకుంది. ఈ మ్యాచ్‌లో 31 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయింది. ఈ జట్టు 17 పరుగుల స్కోరు చేరుకునే సమయానికే ఐదు వికెట్లు కూలాయి.

మహిళా హాకీ కెప్టెన్‌గా వందన
న్యూఢిల్లీ, నవంబర్ 12: మెల్బోర్న్‌లో ఈనెల 23 నుంచి 30 వరకూ ఆస్ట్రేలియాతో జరిగే మహిళల హాకీ సిరీస్‌కు భారత కెప్టెన్‌గా ఫార్వర్డ్ క్రీడాకారిణి వందన కతారియా ఎంపికైంది. డిఫెండర్ సునీత లాక్ర వైస్ కెప్టెన్‌గా సేవలు అందిస్తుంది. గోల్‌కీపర్లుగా సవిత, రజని ఎటిమార్పును కొనసాగించాలని సెలక్టర్లు నిర్ణయించారు. అంతర్జాతీయ హాకీలో అనుభవం ఉన్న పూనమ్ రాణి, అనూరాధ దేవి తొకోమ్, ప్రీతి డూబే, సోనికా తదితరులు జట్టులో చోటును నిలబెట్టుకున్నారు. ఈనెల 23, 25, 27 తేదీల్లో ఆస్ట్రేలియాతో భారత్ మూడు టెస్టులు ఆడుతుంది.