క్రీడాభూమి

ఇంగ్లాండ్ యువ ఓపెనర్ హమీద్ సంచలనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌కోట్: కెరీర్‌లో మొదటి టెస్టు ఆడుతున్న ఇంగ్లాండ్ ఓపెనర్ హసీబ్ హమీద్ రెండో ఇన్నింగ్స్‌లో అర్ధ శతకం సాధించి సంచలనం సృష్టించాడు. ఇంగ్లాండ్ తరఫున తొలి టెస్టులోనే ఈ మైలురాయిని దాటిన 20 ఏళ్లలోపు బ్యాట్స్‌మెన్ జాబితాలో మూడోవాడిగా రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. 1906లో జాక్ క్రాఫోర్డ్, 1937లో డెనిస్ కాంప్టన్ 20 ఏళ్లలోనే టెస్టు క్రికెట్‌లోకి అడుగుపెట్టి, తమతమ మొదటి టెస్టులో హాఫ్ సెంచరీలు సాధించారు. 79 సంవత్సరాల విరామం తర్వాత హమీద్ ఆ జాబితాలో చోటు దక్కించుకున్నాడు.

అప్పుడూ ఇంగ్లాండే!
రాజ్‌కోట్: భారత్‌లో ఒక విదేశీ జట్టు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సంపాదించడం 2012 తర్వాత ఇదే తొలిసారి. అప్పుడు కూడా ఇంగ్లాండ్ జట్టే నాగపూర్ టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లీడ్‌ను సాధించింది. ఆతర్వాత 13 టెస్టుల్లో భారత్ సగటున 155 పరుగుల ఆధిక్యాన్ని నమోదు చేసింది.
ఇంగ్లాండ్‌పై అశ్విన్ 40 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు సాధించడం ఇది ఐదోసారి. మరే ఇతర జట్టుపైనా అతను ఈ ఫీట్‌ను నమోదు చేయలేదు. వెస్టిండీస్‌పై నాలుగు పర్యాయాలు 40 లేదా అంకంటే ఎక్కువ పరుగులు చేశాడు.

రోహిత్ శర్మకు శస్తచ్రికిత్స
న్యూఢిల్లీ, నవంబర్ 12: భారత బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మకు లండన్‌లో శస్త్ర చికిత్స విజయవంతమైంది. ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. మరో 24 గంటల్లో అతనిని డిశ్చార్జి చేస్తారని పేర్కొంది. అతనికి జరుగుతున్న వైద్యాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని తెలిపింది. గాయం కారణంగా రోహిత్ ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న సిరీస్‌కు దూరమైన విషయం తెలిసిందే.