క్రీడాభూమి

డారెన్ బ్రేవోపై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెయింట్ జాన్స్, నవంబర్ 13: వెస్టిండీస్ బ్యాట్స్‌మన్ డారెన్ బ్రేవోపై వేటు పడింది. కాంట్రాక్టు ఫీజు పెంపు, మెరుగైన సౌకర్యాలు వంటి డిమాండ్లపై చాలాకాలంగా వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యుఐసిబి)తో డారెన్ విభేదిస్తున్నాడు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో బోర్డు అధ్యక్షుడు డేవ్ కామెరూన్‌ను ‘బిగ్ ఇడియట్’ (పెద్ద మూర్ఖుడు) అని తిట్టడం మరో కొత్త వివాదానికి కారణమైంది. ‘నాలుగేళ్లుగా అన్ని రకాలుగా నువ్వు విఫలమవుతున్నావు. నాకు కాంట్రాక్టు కూడా ఇవ్వడం లేదు. నువ్వు పెద్ద మూర్ఖుడివి’ అని డారెన్ ట్వీట్ చేయడం కలకలం సృష్టించింది. గతంలో ఆటగాళ్లకు బోర్డుతో ఎన్ని విభేదాలున్నా, ఎంతగా కలహించుకున్నా డారెన్ స్థాయిలో ఎవరూ వీధికెక్కి తిట్లవర్షం కురిపించలేదు. అతను కొంతకాలంగా డబ్ల్యుఐసిబి అధికారులను విమర్శిస్తునే ఉన్నాడు. ఇప్పుడు ఏకంగా బోర్డు అధ్యక్షుడినే మూర్ఖుడిగా పేర్కోవడంతో సమస్య తీవ్రతరమైంది. అతని కాంట్రాక్టును పొడిగించడానికి డబ్ల్యుఐసిబి నిరాకరించింది. అంతేగాక, శ్రీలంక, జింబాబ్వే జట్లు కూడా పాల్గొనే ముక్కోణపు వనే్డ సిరీస్‌లో పాల్గొనే విండీస్ జట్టులో అతనికి స్థానం లభించలేదు. అతని స్థానంలో జాసన్ మహమ్మద్‌కు అవకాశం దక్కింది. కాగా, వ్యక్తిగత కారణాలతో జట్టుకు అందుబాటులో ఉండబోనని స్పిన్నర్ సునీల్ నారైన్ ప్రకటించడంతో ఆ స్థానాన్ని సెలక్టర్లు దేవేంద్ర బిషూతో భర్తీ చేశారు. ముక్కోణపు వనే్డ సిరీస్ ఆదివారం ప్రారంభమై, 27వ తేదీ వరకు జరుగుతుంది.

చిత్రం.. డారెన్ బ్రేవో