క్రీడాభూమి

రెండో రోజు ఆట రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హోబర్ట్, నవంబర్ 13: ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆట వర్షం కారణంగా రద్దయింది. ఉదయం నుంచి భారీ జల్లులు పడడంతో అవుట్ ఫీల్డ్ మొత్తం బురదమయమైంది. వికెట్‌ను కవర్లతో కప్పినప్పటికీ, మైదానం ఆటకు అనువుగా లేకపోవడంతో, స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం రెండు గంటల వరకూ వేచి చూసిన అంపైర్లు చివరికి రెండో రోజు ఆట రద్దయినట్టు ప్రకటించారు. మొదటి రోజు ఆటలో ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 85 పరుగులకే కుప్పకూలగా, దక్షిణాఫ్రికా ఐదు వికెట్లకు 171 పరుగులు చేసిన విషయం తెలిసిందే.
నైపుణ్యం పెంచుకోవాలి: గిల్‌క్రిస్ట్ హితవు
ముంబయి: పొరపాట్లను, లోటుపాట్లను ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ, నైపుణ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఆస్ట్రేలియా క్రికెటర్లకు మాజీ వికెట్‌కీపర్ ఆడం గిల్‌క్రిస్ట్ హితవు పలికాడు. ఒకప్పుడు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన ఆసీస్ ఇటీవల కాలంలో అనుకున్న స్థాయిలో ఆడడం లేదని అంటూ, శ్రీలంక, దక్షిణాఫ్రికా పూర్తి ఆధిపత్యాన్ని కనబరచిన విషయాన్ని గుర్తుచేశాడు. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి టెస్టులో ఓడిన ఆస్ట్రేలియా, రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో కేవలం 85 పరుగులకే కుప్పకూలింది. ఈ విషయాన్ని అతను ప్రస్తావిస్తూ ఈ సిరీస్‌తోపాటు, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భారత్‌లో పర్యటించాల్సిన ఈ జట్టు అన్ని విభాగాల్లోనూ బలోపేతం కావాలని సూచించాడు. నిజానికి శ్రీలంకతో జరిగిన సిరీస్‌తోపాటు, దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టెస్టులో ఆసీస్ బలమైన స్థితిలో ఉన్నప్పటికీ, ఆతర్వాత హఠాత్తుగా నీరుగారిపోయి, ప్రత్యర్థి జట్లకు ఎదురుదాడి చేసే అవకాశాన్ని కల్పించిందని గిల్‌క్రిస్ట్ చెప్పాడు. ఇది ఆందోళన కలిగిస్తున్న అంశమని అన్నాడు. ప్రత్యర్థులను కోలుకోకుండా దెబ్బతీయడానికే అన్ని జట్లు ప్రయత్నిస్తాయని, అదే వ్యూహాన్ని ఆస్ట్రేలియా కూడా అనుసరించాలని అన్నాడు. జట్టులో సమర్థులకు కొదువలేదని, అయితే, కీలక సమయాల్లో నిలకడగా ఆడకపోవడమే విజయావకాశాలను దెబ్బతీస్తున్నదని గిల్‌క్రిస్ట్ అభిప్రాయపడ్డాడు. తీవ్రమైన ఒత్తిడికి గురికావాల్సిన అవసరంగానీ, ఆత్మవిశ్వాసం కోల్పోవాల్సిన పరిస్థితిగానీ ఆసీస్ క్రికెటర్లకు లేదని స్పష్టం చేశాడు. అయితే, నిలకడగా రాణించాల్సిన అవసరం ఉందని కెరీర్‌లో 96 టెస్టులు ఆడి, 5,570 పరుగులు సాధించిన ఈ మాజీ వికెట్‌కీపర్ అన్నాడు.