క్రీడాభూమి

మన స్పిన్నర్లు వెలవెల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌కోట్: స్పిన్‌లో భారత్‌కు తిరుగులేదన్న ధీమాకు ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టెస్టు గండికొట్టింది. ఇంగ్లాండ్ స్పిన్నర్లు సగటు 33.30 పరుగులిచ్చి, 13 వికెట్లు పడగొడితే, భారత స్పిన్నర్లు ఏకంగా 57.88 పరుగులిచ్చి తొమ్మిది వికెట్లు సాధించారు. ఇరు జట్ల స్పిన్నర్లు ఇచ్చిన పరుగుల సగటులో 24.58 వ్యత్యాసం ఉంది. ఇంతకు ముందు, 2012-13 సీజన్‌లో భారత్‌లో పర్యటించినప్పుడు ఇంగ్లాండ్ స్పిన్నర్లు సగటున 17.31 పరుగులిచ్చి 19 వికెట్లు పడగొట్టారు. అదే సమయంలో భారత స్పిన్నర్లు 46.44 సగటుతో తొమ్మిది వికెట్లు మాత్రమే సాధించారు. మొత్తం మీద ఇంగ్లాండ్ ముందు మన స్పిన్నర్లు వెలవెలపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నది.