క్రీడాభూమి

భారత్, ఇంగ్లాండ్ తొలి టెస్టు డ్రా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్‌కోట్, నవంబర్ 13: ముందుగా ఊహించిన విధంగానే భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన తొలి క్రికెట్ టెస్టు డ్రాగా ముగిసింది. అయితే, ఇంగ్లాండ్ కెప్టెన్ అలిస్టర్ కుక్ శతకం సాధించి సవాలు విసరడం, తీవ్రమైన ఒత్తిడికి గురైన టీమిండియా సతమతమైనప్పటికీ చివరికి ఓటమి ప్రమాదం నుంచి బయటపడడం చివరి రోజు ఆటలో విశేషాంశాలు. ఇంగ్లాండ్ మూడు వికెట్లకు 260 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయగా, 310 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన టీమిండియా అనూహ్యంగా వికెట్లు కోల్పోతూ వచ్చింది. దీనితో ఒకానొక దశలో తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పటికీ, ఎక్కువ సమయం లేకపోవడంతో, ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లకు 172 పరుగులు చేసి, మ్యాచ్‌ని ఎలాంటి ఫలితం లేకుండా ముగించింది.
వికెట్ నష్టం లేకుండా 114 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో మ్యాచ్ చివరి రోజు, ఆదివారం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లాండ్ 180 పరుగుల వద్ద తొలి వికెట్‌ను హసీబ్ హమీద్ రూపంలో కోల్పోయింది. 177 బంతులు ఎదుర్కొన్న అతను 82 పరుగులు చేసి అమిత్ మిశ్రా బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. మరో 12 పరుగుల తర్వా త జో రూట్ కూడా వెనుదిరిగాడు. నాలుగు పరుగులు చేసిన అతనిని వికెట్‌కీపర్ వృద్ధిమాన్ సాహా క్యాచ్ పట్టగా అమిత్ మిశ్రా పెవిలియన్‌కు పంపాడు. బెన్ స్టోక్స్‌తో కలిసి జట్టు స్కోరును 250 పరుగుల మైలురాయిని దాటించిన కెప్టెన్ కుక్ 130 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అశ్విన్ బౌలింగ్‌లో రవీంద్ర జడేజా క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు. 243 బంతులు ఎదుర్కొన్న అతని స్కోరులో 13 ఫోర్లు ఉన్నాయి. కెరీర్‌లో 30వ శతకాన్ని నమోదు చేసిన కుక్ తాను అవుటైన వెంటనే రెండో ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేస్తున్నట్టు ప్రకటించాడు. అప్పటికి స్టోక్స్ 29 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. మిశ్రాకు రెండు వికెట్లు లభించగా, అశ్విన్ ఒక వికెట్ సాధించాడు.
గంభీర్ డకౌట్
ఇంగ్లాండ్‌ను ఓడించి, ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ల ఆధిక్యాన్ని సంపాదించేందుకు 310 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం అసాధ్యంగా కనిపించింది. రెండో ఓవర్‌లోనే గౌతం గంభీర్ డకౌట్ కావడంతో, పరుగుల ఖాతాను తెరవక ముందే భారత్ ఒక వికెట్ చేజార్చుకుంది. చటేశ్వర్ పుజారా కూడా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేక, 18 పరుగుల వ్యక్తిగ3త స్కోరువద్ద అదిల్ రషీద్ బౌలింగ్‌లో ఎల్‌బిగా వెనుదిరిగాడు. ఓపెనర్ మురళీ విజయ్ 71 బంతుల్లో 31 పరుగులు చేసి అదిల్ రషీద్ బౌలింగ్‌లోనే హసీబ్ హమీద్ క్యాచ్ పట్టడంతో అవుటయ్యాడు. ఒకదాని తర్వాత మరొకటిగా వికెట్లు కూలడంతో టీమిండియా ఒత్తిడికి గురైనట్టు కనిపించింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ క్రీజ్‌లో నిలదొక్కుకున్నప్పటికీ, 68 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయిన భారత్ మరో మూడు పరుగులకే నాలుగో వికెట్‌గా ఆజింక్య రహానేను చేజార్చుకుంది. అతను కేవలం ఒక పరుగు చేసి మోయిన్ అలీ బౌలింగ్‌లో బంతి దిశను సరిగ్గా అర్థం చేసుకోలేక క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కోహ్లీతో కలిసి స్కోరును వంద పరుగుల మైలు రాయిని దాటించిన అశ్విన్ (32)ను జో రూట్ క్యాచ్ అందుకోగా జాఫర్ అన్సారీ పెవిలియన్‌కు పంపాడు. వృద్ధిమాన్ సాహా తొమ్మిది పరుగులు చేసి, అదిల్ రషీద్ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆతర్వాత రవీంద్ర జడేజాతో కలిసి కోహ్లీ మరో వికెట్ చేజారకుండా జాగ్రత్త పడ్డాడు. వికెట్ల పతనం ఒకానొక దశలో అభిమానులను ఆందోళనకు గురి చేసినప్పటికీ, కోహ్లీ (49 నాటౌట్), జడేజా (32 నాటౌట్) జాగ్రత్త ఆడుతూ మ్యాచ్‌ని డ్రాగా ముగించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 52.3 ఓవర్లలో భారత్ ఆరు వికెట్లకు 172 పరుగులు చేయగా, ఇంగ్లాండ్ బౌలర్లలో అదిల్ రషీద్ 64 పరుగులకు మూడు వికెట్లు పడగొట్టాడు. క్రిస్ వోక్స్, జాఫర్ అన్సారీ, మోయిన్ లీ తలా ఒక వికెట్ సాధించారు.
స్కోరుబోర్డు
ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్: 159.3 ఓవర్లలో ఆలౌట్ 537 (జో రూట్ 124, మోయిన్ అలీ 117, బెన్ స్టోక్స్ 128, మహమ్మద్ షమీ 2/65, ఉమేష్ యాదవ్ 2/112, అశ్విన్ 2/167, రవీంద్ర జడేజా 3/86).
భారత్ మొదటి ఇన్నింగ్స్: 162 ఓవర్లలో 488 ఆలౌట్ (మురళీ విజయ్ 126, చటేశ్వర్ పుజారా 124, రవిచంద్ర అశ్విన్ 70, మోయిన్ అలీ 2/85, జాఫర్ అన్సారీ 2/77, అదిల్ రషీద్ 4/114.
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు వికెట్ నష్టం లేకుండా 114): అలిస్టర్ కుక్ సి రవీంద్ర జడేజా బి అశ్విన్ 130, హసీబ్ హమీద్ సి అండ్ బి అమిత్ మిశ్రా 82, జో రూట్ సి వృద్ధిమాన్ సాహా బి అమిత్ మిశ్రా 4, బెన్ స్టోక్స్ 29 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 15, మొత్తం (75.3 ఓవర్లలో 3 వికెట్లకు) 260 డిక్లేర్డ్.
వికెట్ల పతనం: 1-180, 2-192, 3-260.
బౌలింగ్: మహమ్మద్ షమీ 11-1-29-0, రవీంద్ర జడేజా 15-1-47-0, రవీంద్రన్ అశ్విన్ 23.3-4-63-1, ఉమేష్ యాదవ్ 13-2-47-0, అమిత్ మిశ్రా 13-0-60-2.

చిత్రం.. కెరీర్‌లో 30వ టెస్టు సెంచరీ అలిస్టర్ కుక్ (130)