క్రీడాభూమి

క్వింటన్ డికాక్ శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హోబర్ట్, నవంబర్ 14: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో క్రికెట్ టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 241 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ క్వింటన్ డికాక్ సమయోచిత శతకంతో రాణించి, దక్షిణాఫ్రికాను బలమైన స్థితిలో నిలబెట్టాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లకు 121 పరుగులు చేసింది. ఈ జట్టు దక్షిణాఫ్రికా కంటే ఇంకా 120 పరుగులు వెనుకంజలో కొనసాగుతున్నది. ఎనిమిది వికెట్లు చేతిలో ఉన్నాయి.
దక్షిణాఫ్రికా మొదటి ఇన్నింగ్స్‌లో 85 పరుగులకే కుప్పకూలగా, ఆతర్వాత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఐదు వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. రెండో రోజు ఆట భారీ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా బౌల్ కాకుండానే రద్దయిన విషయం తెలిసిందే. మూడో రోజు, సోమవారం ఆటను కొనసాగించిన దక్షిణాఫ్రికా 100.5 ఓవర్లలో 326 పరుగులకు ఆలౌటైంది. ఏడో వికెట్‌కు టెంబా బవూమాతో కలిసి 144 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని అందించిన డికాక్ 143 బంతులు ఎదుర్కొని 104 పరుగులు సాధించి జాన్ హాజెల్‌వుడ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. అతని స్కోరులో 17 ఫోర్లు ఉన్నాయి. తర్వాత కొద్దిసేపటికే బవూమా వికెట్ కూడా కూలింది. అతను 204 బంతుల్లో 74 పరుగులు చేసి, జో మిల్నే బౌలింగ్‌లో నాథన్ లియాన్‌కు చిక్కాడు. అనంతరం కేశవ్ మహారాజ్ (1), కేల్ అబోట్ (3) ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేకపోయారు. చివరిలో కొద్దిసేపు పోరాడిన వెర్నర్ ఫిలాండర్ 32 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ కావడంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఆ జట్టు 326 పరుగులు చేయగా, అప్పటికి కాగిసో రబదా ఐదు పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో జొష్ హాజెల్‌వుడ్ 89 పరుగులకు ఆరు వికెట్లు పడగొట్టాడు. మిచెల్ స్టార్క్ 79 పరుగులిచ్చి మూడు వికెట్లు కూల్చాడు.
తొలి ఇన్నింగ్స్‌లో వంద పరుగులు కూడా చేయలేక కుప్పకూలిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ ఆరంభించి, తొలి ఓవర్ నాలుగో బంతికే జో బర్న్స్ (0) వికెట్‌ను కోల్పోయింది. అతను కేల్ అబోట్ బౌలింగ్‌లో క్వింటన్ డికాక్ క్యాచ్ అందుకోగా వెనుదిరిగాడు. పరుగుల ఖాతా కూడా తెరవకుండానే వికెట్ చేజార్చుకోవడంతో కంగుతిన్న ఆసీస్‌కు డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖాజా అండగా నిలిచే ప్రయత్నం చేశారు. రెండో వికెట్‌కు 79 పరుగులు జోడించిన తర్వాత వార్నర్ వికెట్ కూలింది. అతను 78 బంతుల్లో 45 పరుగులు చేసి, కేల్ అబోట్ బౌలింగ్‌లోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సెకండ్ డౌట్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన కెప్టెన్ స్టీవెన్ స్మిత్‌తో కలిసి ఉస్మాన్ ఖాజా మరో వికెట్ కూలకుండా జాగ్రత్త పడుతూ, అర్ధ శతకాన్ని పూర్తి చేశాడు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా రెండు వికెట్లకు 121 పరుగులు చేసింది. ఖాజా 103 బంతుల్లో 56, స్మిత్ 32 బంతుల్లో 18 పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. కూలిన రెండు వికెట్లు కేల్ అబోట్‌కు లభించాయి.
సంక్షిప్త స్కోర్లు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 32.5 ఓవర్లలో 85 ఆలౌట్ (స్టీవెన్ స్మిత్ 48 నాటౌట్, జో మెన్నీ 10, వెర్నన్ ఫిలాండర్ 5/21, కేల్ అబోట్ 3/41).
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 100.5 ఓవర్లలో 326 ఆలౌట్ (హషీం ఆమ్లా 47, టెంబా బవూమా 74, క్వింటన్ డికాక్ 104, జొష్ హాజెల్‌వుడ్ 6/89, మిచెల్ స్టార్క్ 3/79).
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: 36 ఓవర్లలో రెండు వికెట్లకు 121 (డేవిడ్ వార్నర్ 45, ఉస్మాన్ ఖాజా 56 నాటౌట్, కేల్ అబోట్ 2/55).