క్రీడాభూమి

భారత్ వచ్చేందుకు పాక్ జట్టు సిద్ధం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 15: లక్నోలో వచ్చే నెల 8 నుంచి 18 వరకు జరిగే జూనియర్ హాకీ ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనేందుకు పాకిస్తాన్ జట్టు రానుంది. సరిహద్దుల్లో చొరబాట్లు, కాల్పుల ఉల్లంఘన, ఉగ్రవాదులను ప్రేరేపించి దాడులకు పాల్పడడం వంటి చర్యలకు పాల్పడుతున్న పాకిస్తాన్‌తో భారత్ ద్వైపాక్షిక క్రీడా సంబంధాలను తెగతెంపులు చేసుకున్న విషయం తెలిసిందే. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో, భారత్‌లో జరిగే టోర్నీలకు పాక్ జట్లు రావడం లేదు. పైగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో తమ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం లేదని, తటస్థ వేదికపైన కూడా సిరీస్‌లు ఆడేందుకు నిరాకరిస్తున్నదని బిసిసిఐపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) ఆగ్రహంతో ఉంది. అందుకే, ఇటీవల భారత్‌లో జరిగిన పలు టోర్నీలకు పాక్ గైర్హాజరైంది. దీనితో జూనియర్ హాకీ ప్రపంచ కప్ పోటీల్లో పాక్ పాల్గొనడం అసాధ్యంగా కనిపించింది. అయితే, భారత్‌లో జరిగే వరల్డ్ కప్‌లో పాల్గొనేందుకు తమ జట్టు సిద్ధంగా ఉందని పాకిస్తాన్ హాకీ సమాఖ్య (పిహెచ్‌ఎఫ్) ప్రకటించిందని ప్రపంచ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) అధ్యక్షుడిగా ఎన్నికైన స్వదేశానికి వచ్చిన తర్వాత మొదటిసారి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ నరీందర్ బాత్రా తెలిపాడు. ఇది శుభపరిణామమని పేర్కొన్నాడు. రెండు దేశాల మధ్య క్రీడా సంబంధాలు మెరుగుపడాలని తాను కోరుకుంటున్నానని చెప్పాడు.