క్రీడాభూమి

ట్యాంపరింగ్ వివాదంలో దక్షిణాఫ్రికా కెప్టెన్ డు ప్లెసిస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, నవంబర్ 18: దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్‌మన్, స్టాండ్‌బై కెప్టెన్ ఫఫ్ డు ప్లెసిస్ బాల్ ట్యాంపరింగ్ వివాదంలో చిక్కుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో అతను ఉద్దేశపూర్వకంగా బంతి ఆకారాన్ని మార్చేందుకు ప్రయత్నించాడని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్‌సన్ పేర్కొన్నాడు. హోబర్ట్ టెస్టు, నాలుగో రోజు ఆట జరుగుతున్నప్పుడు అతను తన నోట్లోని మింట్‌ను వేలితో రాసి, దానిని బంతికి రుద్దినట్టు టీవీ ఫుటేజీలో స్పష్టంగా కనిపించిందని రిచర్డ్‌సన్ తెలిపాడు. అయితే, తాను ఎలాంటి పొరపాటు చేయలేదని, బంతి ఆకారాన్ని మార్చే ఉద్దేశం తనకు లేదని డు ప్లెసిస్ క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చాడు. దీనితో ఈ వివాదం ఐసిసి మ్యాచ్ రిఫరీల ప్యానెల్‌కు వెళుతుంది. అక్కడ తుది నిర్ణయం తీసుకుంటారు.