క్రీడాభూమి

స్ట్ఫోనీ టేలర్ కెప్టెన్ ఇన్నింగ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), నవంబర్ 18: భారత్‌తో శుక్రవారం జరిగిన మొదటి టి-20 క్రికెట్ మ్యాచ్‌ని ఆరు వికెట్ల తేడాతో గెల్చుకున్న వెస్టిండీస్ శుభారంభం చేసింది. విండీస్ కెప్టెన్ స్ట్ఫోనీ టేలర్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడి, తన జట్టును విజయపథంలో నడిపింది. నగరానికి సమీపంలోని మూలపాడులోని దేవినేని వెంకటరమణ-ప్రణీత క్రికెట్ గ్రౌండ్స్‌లో ఈ మ్యాచ్‌లో భారత్‌పై అన్ని విభాగాల్లో వెస్టిండీస్ మహిళలు ఆధిక్యం ప్రదర్శించారు. టాస్ గెలిచి మొదట బ్యాటంగ్‌కు దిగిన భారత జట్టు 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 150 పరుగులు చేసింది. అనంతరం విండీస్ 19.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయ లక్ష్యాన్ని ఛేదించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ బ్యాట్స్‌విమెన్‌లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 68 (నాటౌట్), వేదా కృష్ణమూర్తి 50 చొప్పున పరుగులు చేశారు. వేదాకృష్ణమూర్తి, హర్మన్‌ప్రీత్‌కౌర్‌లు నిలకడగా రాణించి భారత స్కోర్‌ను 150పరుగులకు చేర్చారు.
భారత్ చేతిలో వనే్డ సిరీస్‌ను కోల్పోన విండీస్‌కు టి-20 సిరీస్‌ను అందించే దిశగా తొలి అడుగు వేయాలన్న పట్టుదలతో ఆడిన కెప్టెన్ టేలర్ 51 బంతుల్లోనే 12 ఫోర్లు, మూడు సిక్స్‌లతో 90 పరుగులు చేసింది. ఆమె కెప్టెన్ ఇన్నింగ్స్ విండీస్ విజయంలో కీలక పాత్ర పోషించింది. ఓపెనర్ మాథ్యూస్ 18 పరుగులకు పెవిలియన్‌కు చేరినప్పటికీ టేలర్ ఎక్కడా తడబడకుండా, భారత బౌలర్లపై విరుచుకుపడింది. భారత బౌలర్లు విండీస్ విజయానికి అడ్డుకట్ట వేయలేకపోయారు. మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే భారత బౌలర్లకు పొట్టి ఫార్మాట్‌లో తమదే పెచేయని విండీస్ మహిళలు నిరూపించారు. హీలీ మాథ్యూస్ 18, మెరిసా ఆక్విలెరియా 15 కూపర్ 16, డాటిన్ 11 (నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. భారత బౌలర్లలో శిఖా పాండె మూడు వికెట్లు పడగొట్టింది. కాగా, రెండో టి-20 ఆదివారం జరగుతుంది.