క్రీడాభూమి

భారీ స్కోర్ల భారత కెప్టెన్లలో కోహ్లీకి నాలుగో స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం: విరాట్ కోహ్లీ చేసిన 167 పరుగుల స్కోరు ఇంగ్లాండ్‌పై స్వదేశంలో భారత కెప్టెన్లు సాధించిన అత్యధిక పరుగుల జాబితాలో నాలుగో స్థానాన్ని ఆక్రమించింది. మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ 1964 ఫిబ్రవరిలో జరిగిన ఢిల్లీ టెస్టులో 203 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. 1993లో కోల్‌కతా టెస్టులో మహమ్మద్ అజరుద్దీన్ 182, 1981 డిసెంబర్‌లో బెంగళూరు టెస్టులో సునిల్ గవాస్కర్ 172 చొప్పున పరుగులు చేశారు.
కోహ్లీకి స్వదేశంలో జరిగిన టెస్టుల్లో ఇది రెండో అత్యధిక స్కోరు. ఇదే ఏడాది అక్టోబర్‌లో న్యూజిలాండ్‌తో ఇండోర్‌లో జరిగిన టెస్టులో అతను 211 పరుగులు సాధించాడు.
ఈ ఏడాది కోహ్లీ 9 టెస్టులు (13 ఇన్నింగ్స్)లో 816 పరుగులు చేశాడు. అంటే, అతని సగటు స్కోరు 68 పరుగులు. ఒక క్యాలెండర్ ఇయర్‌లో అతనికి ఇదే ఉత్తమ ఫిగర్.