క్రీడాభూమి

విశాఖ టెస్టులో భారత్ విజయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 21: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భారత జట్టు బోణీ చేసింది. ఈ సిరీస్‌లో భాగంగా ఇంతకుముందు రాజ్‌కోట్‌లో జరిగిన తొలి టెస్టును డ్రాగా ముగించిన భారత జట్టు తాజాగా సోమవారం విశాఖపట్నంలోని వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ఎసిఎ-విడిసిఎ స్టేడియంలో ముగిసిన రెండో టెస్టులో ప్రత్యర్థులను 246 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించి 1-0 ఆధిక్యత సాధించింది. ఈ మ్యాచ్‌లో స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, జయంత్ యాదవ్ అమిత్ మిశ్రాతో పాటు ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ చక్కగా రాణించి భారత జట్టుకు ఈ చిరస్మరణీయ విజయాన్ని అందించారు. 405 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు భారత బౌలర్ల ధాటికి ఏమాత్రం తట్టుకోలేక సోమవారం మధ్యాహ్న భోజన విరామ సమయం ముగిసిన కొద్దిసేపటికే 158 పరుగులకు ఆలౌటై చతికిలబడింది. టెస్టుల్లో ఇంగ్లాండ్‌పై భారత జట్టు సాధించిన అతిపెద్ద విజయాల్లో ఇది రెండవది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 167 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో మరో 81 పరుగులు సాధించి భారత జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన కెప్టెన్ విరాట్ కోహ్లీ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును కైవసం చేసుకున్నాడు.
అంతకుముందు 2 వికెట్ల నష్టానికి 87 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం చివరి రోజు రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఇంగ్లాండ్ జట్టు ఆరంభంలోనే డకెట్ (0) వికెట్‌ను కోల్పోగా, అతని స్థానంలో వచ్చిన మొరుూన్ అలీ (2)ని రవీంద్ర జడేజా, బెన్‌స్టోక్స్ (6)ను జయంత్ యాదవ్ పెవిలియన్‌కు చేర్చగా, నైట్ వాచ్‌మన్ జో రూట్ (25) మహమ్మద్ షమీ బౌలింగ్‌లో లెగ్ బిఫోర్ వికెట్‌గా నిష్క్రమించాడు. ఈ తరుణంలో ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బెయిర్ స్టో స్థిమితంగా ఆడుతూ భారత బౌలర్లను ప్రతిఘటించినప్పటికీ ఆదిల్ రషీద్ (4) షమీ బౌలింగ్‌లో వికెట్ల వెనుక వృద్ధిమాన్ సాహాకు దొరికిపోయాడు. దీంతో మధ్యాహ్న భోజన విరామా సమయానికి 7 వికెట్లు నష్టపోయి 142 పరుగులు సాధించిన ఇంగ్లాండ్ జట్టు ఆ తర్వాత కూడా భారత బౌలర్లను ఏమాత్రం ప్రతిఘటించలేకపోయింది. భోజన విరామ సమయం ముగిసిన తర్వాత అశ్విన్ బౌలింగ్‌లో అన్సారీ (0), జయంత్ యాదవ్ బౌలింగ్‌లో స్టూవర్ట్ బ్రాడ్ (5), జేమ్స్ ఆండర్సన్ (0) పెవిలియన్‌కు పరుగెత్తగా, బెయిర్ స్టో (34) నాటౌట్‌గా నిలిచాడు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో 158 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లాండ్ జట్టు 246 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మ్యాచ్‌లో 119 పరుగులిచ్చి మొత్తం 9 వికెట్లు సాధించిన రవిచంద్రన్ అశ్విన్ ఈ ఏడాది అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌గా అవతరించాడు. ఈ ఏడాది ఇప్పటివరకూ మొత్తం 55 వికెట్లు కైవసం చేసుకుని శ్రీలంక బౌలర్ రంగన హెరత్ (54 వికెట్లు)ను అధిగమించిన అశ్విన్ కెరీర్‌లో ఇప్పటివరకూ 41 టెస్టు మ్యాచ్‌లలో మొత్తం 231 వికెట్లు రాబట్టాడు.

స్కోరు బోర్డు

భారత్ తొలి ఇన్నింగ్స్: 129.4 ఓవర్లలో 455 ఆలౌట్ (చటేశ్వర్ పుజారా 119, విరాట్ కోహ్లీ 167, రవిచంద్రన్ అశ్విన్ 58, జయంత్ యాదవ్ 35, జేమ్స్ ఆండర్సన్ 3/62, అదిల్ రషీద్ 2/110, మోయిన్ అలీ 3/98).
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్: 102.5 ఓవర్లలో 255 ఆలౌట్ (జో రూట్ 53, బెన్ స్టోక్స్ 70, జానీ బెయిర్‌స్టో 53, అదిల్ రషీద్ 32 నాటౌట్, అశ్విన్ 5/67).
భారత్ రెండో ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు 3 వికెట్లకు 98): మురళీ విజయ్ సి జో రూట్ బి స్టువర్ట్ బ్రాడ్ 3, లోకేష్ రాహుల్ సి జానీ బెయిర్‌స్టో బి స్టువర్ట్ బ్రాడ్ 10, చటేశ్వర్ పుజారా బి జేమ్స్ ఆండర్సన్ 1, విరాట్ కోహ్లీ సి బెన్ స్టోక్స్ బి అదిల్ రషీద్ 81, ఆజింక్య రహానే సి అలస్టర్ కుక్ బి స్టువర్ట్ బ్రాడ్ 26, రవిచంద్రన్ అశ్విన్ సి జానీ బెయిర్‌స్టో బి స్టువర్ట్ బ్రాడ్ 7, వృద్ధిమాన్ సాహా ఎల్‌బి అదిల్ రషీద్ 2, రవీంద్ర జడేజా సి మోయిన్ అలీ బి అదిల్ రషీద్ 14, జయంత్ యాదవ్ 27 నాటౌట్, ఉమేష్ యాదవ్ సి జానీ బెయిర్‌స్టో బి అదిల్ రషీద్ 0, మహమ్మద్ షమీ స్టెంప్డ్ జానీ బెయిర్‌స్టో బి మోయిన్ అలీ 19, ఎక్‌స్ట్రాలు 14, మొత్తం (63.1 ఓవర్లలో ఆలౌట్) 204.
వికెట్ల పతనం: 1-16, 2-17, 3-40, 4-117, 5-127, 6-130, 7-151, 8-162, 9-162, 10-204.
బౌలింగ్: జేమ్స్ ఆండర్సన్ 15-3-33-1, స్టువర్ట్ బ్రాడ్ 14-5-33-4, అదిల్ రషీద్ 24-5-82-4, బెన్ స్టోక్స్ 7-0-34-0, మోయిన్ అలీ 3.1-1-9-1.
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ (లక్ష్యం 405): ఆలిస్టర్ కుక్ ఎల్‌బి రవీంద్ర జడేజా 54, హసీబ్ హమీద్ ఎల్‌బి అశ్విన్ 25, జో రూట్ ఎల్‌బి మహమ్మద్ షమీ 25, డకెట్ సి వృద్ధిమాన్ బి అశ్విన్ 0, మొరుూన్ అలీ సి కోహ్లీ బి జడేజా 2, బెన్ స్టోక్స్ బి జయంత్ యాదవ్ 6, బెయిర్‌స్టో నాటౌట్ 34, ఆదిల్ రషీద్ సి వృద్ధిమాన్ బి మహమ్మద్ షమీ 4, అన్సారీ బి అశ్విన్ 0, స్టూవర్ట్ బ్రాడ్ ఎల్‌బి జయంత్ యాదవ్ 5, జేమ్స్ ఆండర్సన్ ఎల్‌బి జయంత్ యాదవ్ 0, ఎక్స్‌ట్రాలు: 3, మొత్తం: 97.3 ఓవర్లలో 158 ఆలౌట్.
వికెట్ల పతనం: 1-75, 2-87. 3-92, 4-101, 5-115, 6-115, 7-129, 8-143, 9-158, 10-158
బౌలింగ్: మహమ్మద్ షమీ 14-3-30-2, ఉమేష్ యాదవ్ 8-3-8-0, రవిచంద్రన్ అశ్విన్ 30-11-52-3, రవీంద్ర జడేజా 34-14-35-2, జయంత్ యాదవ్ 11.3-4-30-3.

చిత్రం.. ఎసిఎ-విడిసిఎ స్టేడియంలో విరాట్ కోహ్లీ సేన విజయోత్సాహం