క్రీడాభూమి

సింధు, సైనా శుభారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌలూన్, నవంబర్ 23: ఇటీవలే చైనా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్‌ను కైవసం చేసుకున్న తెలుగు తేజం పివి సింధు, గాయం నుంచి కోలుకొని మళ్లీ అంతర్జాతీయ కెరీర్‌ను కొనసాగిస్తున్న హైదరాబాదీ సైనా నెహ్వాల్ ఇక్కడ జరుగుతున్న హాంకాంగ్ సూపర్ సిరీస్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో శుభారంభం చేశారు. సింధు తన తొలి రౌండ్ మ్యాచ్‌లో సుశాంతో యులియాను 21-13, 21-16 తేడాతో సునాయాసంగా ఓ డించింది. సింధు దూకుడుకు కళ్లెం వేయడా నికి యులియా రెండో సెట్‌లో కొంతసేపు పో రాడినప్పటికీ ఫలితం దక్కలేదు.
చైనా ఓపెన్ మొదటి రౌండ్‌లో పోర్న్‌టిప్ బురనప్రసెర్ట్‌సుక్ చేతిలో పరాజయాన్న చవిచూసిన సైనా ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. హాంకాంగ్ ఓపెన్ మొదటి రౌండ్‌లో ఆమెను 12-21, 21-19, 21-17 తేడాతో ఓడించింది. మోకాలికి శస్తచ్రికిత్స చేయంచు కున్న తర్వాత సైనా ఒక మ్యాచ్‌లో గెలవడం ఇదే మొదటిసారి. చైనా ఓపెన్‌తో పోలిస్తే ఈ టోర్నీలో ఆమె మళ్లీ పూర్వవైభవాన్ని గుర్తుతె చ్చే విధంగా ఆడడం విశేషం.
ఇలావుంటే, పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్ 21-16, 21-18 స్కోరుతో చైనాకు చెందిన క్వియావో బిన్‌పై గెలుపొందాడు. జాతీయ చాంపియన్ సమీర్ వర్మ 22-20, 21-18 ఆధిక్యంతో జపాన్ క్రీడాకారుడు తకుమా ఉయేదాను ఓడించి రెండో రౌండ్ చేరాడు. అజయ్ జయరామ్ 21-15, 13-21, 21-16 స్కోరుతో ఆంథోనీ సి గింటింగ్‌ను ఇంటికి పంపాడు. కాగా, సాయి ప్రణీత్‌కు మొదటి రౌండ్‌లోనే చుక్కెదురైంది. అతను 18-21, 18-21 తేడాతో జాన్ ఒ జొర్గెనె్సన్ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. పురుషుల డబుల్స్‌లో సుమీత్ రెడ్డి, మను అత్రి జోడీ మొదటి రౌండ్ నుంచే నిష్క్రమించింది. వీరిపై కొ సంగ్ హ్యున్, సొల్గిన్ చోయ్ జోడీ 21-15, 21-18 ఆధిక్యంతో విజయం సాధించింది.