క్రీడాభూమి

రాహుల్‌కు గాయం.. రేసులో ధావన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొహాలీ, నవంబర్ 26: భారత ఓపెనర్ లోకేష్ రాహుల్ చేతి గాయం పూర్తిగా నయం కాకపోవడంతో ఇంగ్లాండ్‌తో శనివారం ప్రారంభమైన మూడో టెస్టుకు దూరమయ్యాడు. విశాఖపట్నంలో జరిగిన రెండో టెస్టులో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో రాహుల్ చేతికి గాయమైంది. నెట్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో రాహుల్‌కు నొప్పి మరింత పెరిగిందని, అందుకే మూడో టెస్టుకు అతను దూరమయ్యాడని జట్టు మేనేజ్‌మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇంతకు ముందు న్యూజిలాండ్‌తో నాగపూర్‌లో టెస్టు ఆడుతూ కాలి కండరాలు బెణకడంతో రాహుల్ చివరి రెండు టెస్టులతోపాటు, అదే జట్టుతో జరిగిన వనే్డ సిరీస్‌లోనూ ఆడలేకపోయాడు. గాయం నుంచి కోలుకొని తిరిగి జట్టులోకి వచ్చినప్పటికీ మరోసారి ఫిట్నెస్ సమస్యతోనే అతను మూడో టెస్టులో బరిలోకి దిగలేకపోయాడు. ముంబయిలో నాలుగో టెస్టు ప్రారంభమయ్యే నాటికి రాహుల్ కోలుకోవడం కష్టంగానే కనిపిస్తున్నది. ఈ నేపథ్యంలో అతని స్థానాన్ని దక్కించుకోవడానికి శిఖర్ ధావన్ రేసులోకి వచ్చాడు. బొటనవేలి గాయం కారణంగా న్యూజిలాండ్ సిరీస్‌కు దూరమైన అతను పూర్తిగా కోలుకోవడమేగాక, రంజీ ట్రోఫీ మ్యాచ్‌లోనూ ఆడాడు. ఫిట్నెస్ సమస్యను అధిగమించిన అతనికి మళ్లీ జాతీయ జట్టులో చోటు దక్కే అవకాశాలున్నాయి. కాగా, కెరీర్‌లో ఇప్పటి వరకూ 10 టెస్టులు, మూడు వనే్డలు, ఐదు టి-20 ఇంటర్నేషనల్స్ ఆడిన రాహుల్‌ను తరచుగా అనారోగ్యం లేదా గాయాల బాధలు వేధిస్తున్నాయి. సరైన ఫిట్నెస్ లేక అతను చాలా టోర్నీలు, సిరీస్‌ల్లో పాల్గొనలేకపోయాడు. తాజా గాయం కారణంగా అతను ఎంతకాలం విశ్రాంతి తీసుకుంటాడన్నది ఇంకా స్పష్టం కాలేదు.