క్రీడాభూమి

ఇంగ్లాండ్ 283 ఆలౌట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మొహాలీ, నవంబర్ 27: ఇక్కడి పిసిఎ స్టేడియంలో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆటలో ఇంగ్లాండ్‌ను 283 పరుగులకు ఆలౌట్ చేసిన టీమిండియా తర్వాత మొదటి ఇన్నింగ్స్ ఆరంభించి ఆట ముగిసే సమయానికి ఆరు వికెట్లకు 271 పరుగులు చేసింది. ప్రత్యర్థి కంటే కేవలం 12 పరుగులు వెనుకంజలో ఉన్న భారత్ చేతిలో నాలుగు వికెట్లున్నాయి. దీనితో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించడం ఖాయంగా కనిపిస్తున్నది. ఎనిమిది వికెట్లకు 268 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో ఆదివారం ఉదయం ఆటను కొనసాగించిన ఇంగ్లాండ్ మరో 15 పరుగులకు మిగతా రెండు వికెట్లు కోల్పోయింది. అదిల్ రషీద్ నాలుగు పరుగులు చేసి మహమ్మద్ షమీ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ పార్థీవ్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్‌కాగా, కేవలం ఒక పరుగు చేసి గారెత్ బాటీని షమీ ఎల్‌బిగా అవుట్ చేశాడు. ఇంగ్లాండ్ 93.5 ఓవర్లలో 283 పరుగులకు ఆలౌటయ్యే సమయానికి జేమ్స్ ఆండర్సన్ 13 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. భారత బౌలర్లలో షమీ మూడు వికెట్లు పడగొట్టాడు. ఉమేష్ యాదవ్, జయంత్ యాదవ్, రవీంద్ర జడేజా తలా రెండు వికెట్లు కూల్చారు. రవిచంద్రన్ అశ్విన్‌కు ఒక వికెట్ లభించింది.
మూడు అర్ధ శతకాలు
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్‌కు ముగ్గురు బ్యాట్స్‌మెన్ అర్ధ శతకాలను అందించారు. 39 పరుగుల స్కోరువద్ద మురళీ విజయ్ (12) వికెట్‌ను జానీ బెయిర్‌స్టో క్యాచ్ పట్టగా బెన్ స్టోక్స్ పడగొట్టాడు. 65 బంతులు ఎదుర్కొని, 42 పరుగులు సాధించిన పార్థీవ్ పటేల్‌ను అదిల్ రషీదల్ ఎల్‌బిగా పెవిలియన్ పంపాడు. ఆతర్వాత చటేశ్వర్ పుజారా, కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడో వికెట్‌కు 75 పరుగులు జోడించి, జట్టును ఆదుకున్నారు. పుజారా 104 బంతుల్లో, ఎనిమిది ఫోర్ల సాయంతో 51 పరుగులు చేసి, అదిల్ రషీద్ బౌలింగ్‌లో క్రిస్ వోక్స్ క్యాచ్ అందుకోగా పెవిలియన్ చేరాడు. దీనితో 148 పరుగుల స్కోరువద్ద భారత్ మూడో వికెట్ కోల్పోయింది. ఆజింక్య రహానే పరుగుల ఖాతా తెరవక ముందే అదిల్ రషీద్ అతనిని ఎల్‌బి చేశాడు. కరుణ్ నాయర్ నాలుగు పరుగులు చేసి దురదృష్టవశాత్తు రనౌటయ్యాడు. అనంతరం రవిచంద్ర అశ్విన్‌తో కలిసి జట్టు స్కోరును 200 పరుగుల మైలురాయిని దాటించిన విరాట్ కోహ్లీ 62 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద అవుటయ్యాడు. 127 బంతులు ఎదుర్కొన్న అతనిని జానీ బెయిర్‌స్టో క్యాచ్ అందుకోగా బెన్ స్టోక్స్ వెనక్కు పంపాడు. కోహ్లీ వికెట్ 204 పరుగుల వద్ద కూలగా, రవీంద్ర జడేజాతో కలిసి అశ్విన్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. అతను 82 బంతుల్లో 57, జడేజా 56 బంతుల్లో 31 పరుగులతో క్రీజ్‌లో ఉండగా, భారత్ 83.3 ఓవర్లలో ఆరు వికెట్లకు 271 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్ అదిల్ రషీద్ మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. బెన్ స్టోక్స్‌కు రెండు వికెట్లు దక్కాయి.

స్కోరుబోర్డు

ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ (ఓవర్‌నైట్ స్కోరు 8 వికెట్లకు 268): అలస్టర్ కుక్ సి పార్థీవ్ పటేల్ బి అశ్విన్ 27, సహీబ్ హమీద్ సి ఆజింక్య రహానే బి ఉమేష్ యాదవ్ 9, జో రూట్ ఎల్‌బి జయంత్ యాదవ్ 15, మోయిన్ అలీ సి మురళీ విజయ్ బి మహమ్మద్ షమీ 16, జానీ బెయిర్‌స్టో ఎల్‌బి జయంత్ యాదవ్ 89, బెన్ స్టోక్స్ స్టెంప్డ్ పార్థీవ్ పటేల్ బి రవీంద్ర జడేజా 29, జొస్ బట్లర్ సి విరాట్ కోహ్లీ బి రవీంద్ర జడేజా 43, క్రిస్ వోక్స్ బి ఉమేష్ యాదవ్ 25, అదిల్ రషీద్ సి పార్థీవ్ పటేల్ బి మహమ్మద్ షమీ 4, గారెత్ బాటీ ఎల్‌బి మహమ్మద్ షమీ 1, జేమ్స్ ఆండర్సన్ 13 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 12, మొత్తం (93.5 ఓవర్లలో) 283 ఆలౌట్.
వికెట్ల పతనం: 1-32, 2-51, 3-51, 4-87, 5-144, 6-213, 7-258, 8-266, 9-268, 10-268.
బౌలింగ్: మహమ్మద్ షమీ 21.5-5-63-3, ఉమేష్ యాదవ్ 16-4-58-2, జయంత్ యాదవ్ 15-5-49-2, రవిచంద్రన్ అశ్విన్ 18-1-43-1, రవీంద్ర జడేజా 23-4-59-2.
భారత్ మొదటి ఇన్నింగ్స్: మురళీ విజయ్ సి జానీ బెయిర్‌స్టో బి బెన్ స్టోక్స్ 12, పార్థీవ్ పటేల్ ఎల్‌బి అదిల్ రషీద్ 42, చటేశ్వర్ పుజారా సి క్రిస్ వోక్స్ బి అదిల్ రషీద్ 51, విరాట్ కోహ్లీ సి జానీ బెయిర్‌స్టో బి బెన్ స్టోక్స్ 62, ఆజింక్య రహానే ఎల్‌బి అదిల్ రషీద్ 0, కరుణ్ నాయర్ రనౌట్ 4, రవిచంద్ర అశ్విన్ 57 బ్యాటింగ్, రవీంద్ర జడేజా 31 బ్యాటింగ్, ఎక్‌స్ట్రాలు 12, మొత్తం (83.3 ఓవర్లలో 6 వికెట్లకు) 271.
వికెట్ల పతనం: 1-39, 2-73, 3-148, 4-152, 5-156, 6-204.
బౌలింగ్: జేమ్స్ ఆండర్సన్ 15.3-3-36-0, క్రిస్ వోక్స్ 15-5-47-0, మోయిన్ అలీ 15-5-47-0, అదిల్ రషీద్ 24-4-81-3.

మూడో వికెట్‌కు 75 పరుగులు జోడించిన
చటేశ్వర్ పుజారా, కెప్టెన్ విరాట్ కోహ్లీ