క్రీడాభూమి

ప్రీ క్వార్టర్స్‌కు కశ్యప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మకావూ, నవంబర్ 30: భారత ఆటగాడు ఇక్కడ జరుగుతున్న మకావూ ఓపెన్ బాడ్మింటన్ గ్రాండ్ ప్రీ గోల్డ్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో ప్రీ క్వార్టర్స్ చేరాడు. అతను రెండో రౌండ్‌లో చైనీస్ తైపీకి చెందిన చున్ వెయ్ చెన్‌ను 21-19, 21-8 తేడాతో సులభంగానే ఓడించి, లిన్ యూ సియెన్‌తో పోరును ఖాయం చేసుకున్నాడు. మరో రెండు రౌండ్ మ్యాచ్‌లో సియెన్ 21-15, 21-13 తేడాతో ఆండ్రె మార్టిన్‌పై విజయం సాధించాడు. సాయి ప్రణీత్ రెండో రౌండ్‌లో సన్ ఫీజింగ్‌ను 21-12, 21-15 స్కోరుతో ఓడించి ప్రీ క్వార్టర్స్ చేరాడు. అతను క్వార్టర్స్‌లో అడుగుపెట్టేందుకు వాంగ్ వింగ్ కీతో పోటీపడతాడు. వాంగ్ వింగ్ రెండో రౌండ్‌లో ఇస్కందర్ జుల్‌కర్మెయిన్ జైనుద్దీన్‌ను 21-8, 21-23, 21-19 ఆధిక్యంతో ఓడించాడు. అయితే, యువ ఆటగాడు సమీర్ వర్మ రెండో రౌండ్‌లో పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. అతనిని మహమ్మద్ బయూ పాంగిస్టు 21-18, 21-13 తేడాడో వరుస సెట్లలో చిత్తుచేశాడు. డబుల్స్ విభాగంలో మనూ అత్రి, సుమీత్ రెడ్డి జోడీ ముందంజ వేసింది. వీరు రెండో రౌండ్‌లో చాన్ అలాన్ యున్ లంగ్, లీ కుయెన్ హాన్ జోడీని 21-11, 17-21, 21-9 తేడాతో ఓడించారు.
సైనా శుభారంభం
మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ శుభారంభం చేసింది. తొలి రౌండ్‌లో ఆమె హన్నా రమదినీని 21-23, 21-14, 21-18 తేడాతో ఓడించింది. మొదటి సెట్‌ను చేజార్చుకున్నప్పటికీ, తర్వాత రెండు సెట్లలో ఆమె అద్వితీయ పోరాట పటిమను కనబరి విజయభేరి మోగించింది. కాగా, వరుసగా మూడు పర్యాయాలు ఈ టైటిల్‌ను కైవసం చేసుకొని హ్యాట్రిక్ సృష్టించిన పివి సింధు ఈసారి టోర్నీ నుంచి వైదొలగింది.