క్రీడాభూమి

ఆ ఆలోచన నిజమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జొహానె్నస్‌బర్గ్, జనవరి 13: రిటైర్మెంట్ గురించి తాను ఆలోచిస్తున్నట్టు మీడియాలో వచ్చిన వార్తల్లో నిజం లేకపోలేదని దక్షిణాఫ్రికా వనే్డ జట్టు కెప్టెన్ ఎబి డివిలియర్స్ స్పష్టం చేశాడు. గత రెండుమూడు సంవత్సరాలుగా తాను ఇదే విషయాన్ని ఆలోచిస్తున్నానని ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. కొన్ని టోర్నీలు, మ్యాచ్‌ల నుంచి వైదొలగడం ద్వారా సాధ్యమైనంత ఎక్కువగా క్రికెట్‌ను ఆస్వాదించాలని అనుకుంటున్నట్టు చెప్పాడు. అవిశ్రాంతంగా మ్యాచ్‌లు ఆడుతూపోతే ఆటపై ఆసక్తి సన్నగిల్లే ప్రమాదం ఉందన్నాడు. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాలన్న ఆలోచన కూడా అప్పుడప్పుడు వస్తున్నట్టు డివిలియర్స్ చెప్పాడు. అయితే, ఈ విషయాన్ని తాను తీవ్రంగా ఆలోచించడం లేదని, ప్రస్తుతానికి నిర్ణయం తీసుకునే అవకాశం లేదని తెలిపాడు.