క్రీడాభూమి

జూనియర్ బాడ్మింటన్ అండర్-13 సింగిల్స్ విజేతలు ప్రణవ్‌రావు, అనుపమ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), డిసెంబర్ 5: జాతీయ స్థాయి సబ్ జూనియర్ బాడ్మింటన్ అండర్-13 సింగిల్స్ బాలుర చాంపియన్‌షిప్‌ను తెలంగాణకు చెందిన జి ప్రణవ్‌రావు కైవసం చేసుకోగా, బాలికల విభాగంలో అనుపమ ఉపాధ్యాయ దక్కించుకుంది. ఫైనల్‌లో అతను శంకర్‌ముత్తుసామి (తమిళనాడు)పై 21-12, 21-16 తేడాతో విజయం సాధించాడు. బాలికల సింగిల్స్ ఫైనల్‌లో అనుపమ 21-19, 21-19 తేడాతో మేఘనరెడ్డి పై గెలుపొంది టైటిల్ సాధించింది.
అండర్-15 బాలుర విభాగంలో తుకుంలా, బాలికల విభాగంలో ఉత్సవపలిత్ చాంపియన్‌షిప్‌ను సాధించారు. బాలుర టైటిల్ పోరులో తుకుంలా 18-21, 21-11, 21-16 తేడాతో ప్రియాన్షు రజవత్‌ను ఓడించాడు. బాలికల విభాగంలో ఉత్సవపలిత్ బాలుర అండర్-13 సింగిల్స్ విభాగం ఫైనల్స్‌లో 21-13, 19-21,21-18 ఆధిక్యంతో కవిప్రియపై విజయం సాధించింది.
సాయ విష్ణుకు రజతం
అండర్-13 బాలుర విభాగంలో పోటీపడిన జాతీయ బాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ కుమారుడు సాయివిష్ణుకు రజతం దక్కింది. ప్రణవ్‌తో కలిసి బరిలోకి దిగిన అతను ఫైనల్‌లో 16-21, 15-21 స్కోరుతో వంశీకృష్ణరాజ్, ఉన్నిత్ కృష్ణ జోడీ చేతిలో పరాజయాన్ని ఎదుర్కొని ద్వితీయ స్థానంతో సంతృప్తి చెందాడు. కాగా, బాలికల అండర్-13 డబుల్స్ విభాగం ఫైనల్స్‌లో శ్రేయచితూర్, ప్రవీణ జోడీపై 21-8, 21-16 తేడాతో అవంతిక పాండే, అనుపమ ఉపాధ్యాయ జోడీ గెలుపొంది టైటిల్ అందుకున్నారు. అండర్-15 బాలుర డబుల్స్ ఫైనల్‌లో సలాం, పున్షిబాల జోడీపై 21-19, 21-10 తేడాతో ఎడ్విన్ జోయ్, అరవింద్, సురేష్ జోడీ, బాలికల డబుల్స్ ఫైనల్‌లో అనన్యప్రవీణ్, మేధాశశిధరన్ జోడీపై 21-14, 21-19 తేడాతో కెయు రామోపాటి, కవిప్రియ జోడీ విజయాలను నమోదు చేశారు. కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్ బాడ్మింటన్ అసోసియేషన్‌ల సంయుక్త ఆధ్వర్యంలో, మూడు స్టేడియాల్లో జరిగిన ఈ డిపిఎస్ వరల్డ్ స్కూల్ 30వ జాతీయ స్థాయి సబ్ జూనియర్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్ బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ (శాప్) వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ బంగారరాజు విజేతలకు ట్రోఫీలు అందజేశారు.

చిత్రం..జాతీయ స్థాయి సబ్ జూనియర్ బాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లోని వివిధ విభాగాల్లో ట్రోఫీలు అందుకున్న విజేతలు