క్రీడాభూమి

చపెకొయన్స్‌కే సుడామేరికనా కప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసన్సియన్, డిసెంబర్ 6: ఇటీవల కొలంబియాలో జరిగిన విమాన ప్రమాదంలో నలుగురు మినహా మిగతా క్రీడారులందరినీ కోల్పోయిన చపెకొయన్స్ జట్టుకు సుడామేరికానా టైటిల్‌ను ప్రకటించారు. కొలంబియాకు చెందిన అట్లెటికో నేషనల్ జట్టుతో కోపా సుడామెరికానా ఫైనల్ ఆడేందుకు వెళ్తున్న సమయంలో జరిగిన ప్రమాదంలో చపెకొయన్స్ ఫుట్‌బాల్ క్రీడాకారులు 19 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సంఘటనలో మొత్తం 71 మంది దుర్మరణం చెందారు. వీరిలో చపెకొయన్స్ క్రీడాకారులపాటు అదే క్లబ్‌కు చెందిన 17 మంది సిబ్బంది, ఏడుగురు డైరక్టర్లు కూడా ఉన్నారు. కాగా, భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా తరలి వచ్చిన వేలాది మంది అభిమానుల సమక్షంలో ఆటగాళ్ల భౌతిక దేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. రెండు రోజుల క్రితం ఈ కార్యక్రమం పూర్తికాగా, సుడామెరికానా టోర్నమెంట్ అధికారులు మంగళవారం సమావేశమై, చపెకొయన్స్ జట్టును విజేతగా ప్రకటించారు. సహజంగా ఒక జట్టు ఫైనల్ పోరుకు హాజరుకాకపోతే, రెండో జట్టుకు ట్రోఫీని ప్రకటిస్తారు. కానీ, విమాన దుర్ఘటన నేపథ్యంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని చపెకొయెన్స్‌కు టైటిల్‌ను అందిస్తున్నట్టు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఫైనల్ చేరిన అట్లెటికో నేషనల్ జట్టు కూడా ఈ నిర్ణయానికి మద్దతు ప్రకటించడం విశేషం.

చపెకొయన్స్ జట్టు ఆటగాళ్ల ఫొటోలతో అభిమానుల
విక్టరీ ల్యాప్ (ఇన్‌సెట్‌లో) చపెకొయన్స్ ఫైల్ ఫొటో