క్రీడాభూమి

బిసిసిఐ కేసు మళ్లీ వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 9: లోధా సిఫార్సులను అమలు చేయకుండా తాత్సారం చేస్తున్న బిసిసిఐపై తీసుకోబోయే చర్యలను ఖాయం చేయడాన్ని సుప్రీం కోర్టు మళ్లీ వాయిదా వేసింది. ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం ఈనెల 5వ తేదీన తుది తీర్పునిస్తుందని తొలుత అనుకున్నారు. అయితే, టిఎస్ ఠాకూర్ అనారోగ్యం కారణంగా విధులకు హాజరుకాకపోవడంతో కేసు శుక్రవారం నాటికి వాయిదా పడింది. లోధా కమిటీ సమర్పించిన స్టేటస్ రిపోర్టును ఇప్పటికే పరిశీలించిన సుప్రీం కోర్టు ఈ కేసులో తీర్పునిస్తుందని, కనీసం బిసిసిఐకి కొన్ని మార్గదర్శకాలను సూచిస్తుందని వార్తలు వచ్చాయి. కానీ, పరిష్కరించాల్సిన పలు కీలక కేసులు పెండింగ్‌లో ఉన్నందున ఈ కేసును 14వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు సుప్రీం కోర్టు ధర్మాసనం ప్రకటించింది. లోధా సిఫార్సులను అమలు చేయకుండా బిసిసిఐ చాలాకాలం నెట్టుకొచ్చిన విషయం తెలిసిందే. సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాలను పట్టించుకోని బిసిసిఐ చివరికి తాజాగా జరిగిన ప్రత్యేక సర్వసభ్య సమావేశం (ఎస్‌జిఎం)లోనూ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. దీనితో బోర్డు ఆలోచన ఏమై ఉంటుందనేది ఉత్కంఠగా మారింది. లోధా ప్రతిపాదనలను అమలు చేస్తామంటూ అఫిడవిట్‌ను దాఖలు చేస్తే తప్ప సభ్య సంఘాలకు ఎలాంటి చెల్లింపులు జరపరాదని లోధా కమిటీ ఇంతకు ముందు ఆదేశాలు జారీ చేసిన సుప్రీం కోర్టు ఆతర్వాత ఇంగ్లాండ్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో మ్యాచ్‌లకు అతిథ్యమిచ్చే సభ్య దేశాలకు చెల్లింపులను అనుమతించింది. అంతకు ముందు సుప్రీం కోర్టు జారీ చేసిన ఆదేశాలను సాకుగా చూపి, ఇంగ్లాండ్‌తో జరిగే సిరీస్‌పై నీలినీడలు కమ్ముకున్నాయంటూ బోర్డు రోడ్డుకెక్కి రాద్ధాంతం చేయడాన్ని ఎవరూ మరచిపోలేదు. ఆ వెంటనే, సిరీస్‌లో ఒక్కో టెస్టుకు 58.66 లక్షల రూపాయలు చెల్లించవచ్చంటూ కోర్టు అనుమతినివ్వడంతో బోర్డు పెద్దలకు ఏం చేయాలో అర్థం కాలేదు. చివరి రెండు టెస్టులకు కూడా నిధులను విడుదల చేయవచ్చని కోర్టు చెప్పడం వల్ల ఒక రకంగా బోర్డుకు వెలుసుబాటు లభించినా, తన వాదనకు బలమైన పునాదులు వేసుకునే అవకాశాన్ని కోల్పోయినట్టు స్పష్టం కావడంతో మల్లగుల్లాలు పడుతున్నది. లోధా కమిటీ సిఫార్సులను అమలు చేయకుండా తప్పించుకోవడానికి బిసిసిఐ చేస్తున్న ప్రయత్నాలకు సుప్రీం కోర్టు ఎప్పటికప్పుడు చెక్ పెడుతునే ఉంది. టెస్టుల నిర్వాహణకు నిధులు విడుదల చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ద్వారా బోర్డును మరోసారి దిక్కుతోచని పరిస్థితిలోకి నెట్టింది. కాగా, ఇప్పటికే ఐపిఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్ కేసును, బిసిసిఐలో జరుగుతున్న అవినీతిని పలు సందర్భాల్లో ఎండగట్టిన సుప్రీం కోర్టు అదే తరహా నిర్ణయాలతో ముందుకెళ్లడం ఖాయంగా కనిపిస్తున్నది. భారత క్రికెట్‌ను పారదర్శకంగా ఉంచాలన్న నిర్ణయానికి వచ్చిన సుప్రీం కోర్టు ఆ దిశగానే తీర్పునిచ్చే అవకాశాలున్నాయి. లోధా కమిటీ ఇచ్చిన నివేదికలోని ప్రతిపాదనలను అమలు చేయడానికి వెనుకంజ వేస్తున్న బిసిసిఐకి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా, పకడ్బందీగా తీర్పు లేదా మార్గదర్శకాలను ఇస్తుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బోర్డు అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ బిజెపి పార్లమెంటు సభ్యుడు కావడంతో కేంద్ర మద్దతు ఉంటుందన్న వాదన లేకపోలేదు. కానీ, సుప్రీం కోర్టు ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకునే అవకాశమే లేదు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకూ క్రీడా బిల్లును ఆమోదించకపోవడంతో, బిసిసిఐపై చర్యలు తీసుకునే అధికారం కేవలం కోర్టుకు మాత్రమే ఉందనేది వాస్తవం. కాబట్టి, 14వ తేదీన వెలువడే ఆదేశాలను మన్నించి, వాటి ప్రకారం నడుచుకోవడం తప్ప బిసిసిఐకి చేయగలిగింది ఏమీ లేదు. లోధా కమిటీ సిఫార్సుల్లో ఎక్కడా బిసిసిఐపై ప్రభుత్వ ఆజమాయిషీకి ఆస్కారం లేదన్నదు. ఈ అంశానే్న తనకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నించే అవకాశాలు లేకపోలేదు. కానీ, కేంద్రం క్రీడా బిల్లును ఆమోదిస్తే తప్ప, బిసిసిఐపై కేంద్రానికి పట్టు సాధ్యం కాదు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు పెద్దనోట్ల రద్దు వివాదంపై పదేపదే వాయిదా పడుతున్న తరుణంలో, కీడా బిల్లు గురించి కేంద్రం ప్రస్తావిస్తుందనిగానీ, సభ్యులు అనుకూలంగా స్పందిస్తారనిగానీ అనుకోవడం అత్యాశే. మొత్తం మీద మరో ఐదు రోజుల్లో కేసు విచారణకు వచ్చినప్పుడు సుప్రీం కోర్టు ధర్మాసనం ఏ విధంగా స్పందిస్తుందోనన్న ఆసక్తి అందరిలోనూ కనిపిస్తున్నది.