క్రీడాభూమి

ఎనిమిది ఓవర్లకే ‘లాంఛనం’ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, డిసెంబర్ 12: ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల క్రికెట్ సిరీస్‌లో భాగంగా ముంబయిలోని వాంఖడే స్టేడియంలో జరిగిన నాలుగో టెస్టులో భారత జట్టు విజయభేరి మోగించింది. ఇన్నింగ్స్ 36 పరుగుల భారీ తేడాతో సోమవారం ఇంగ్లాండ్‌ను మట్టికరిపించి మిగిలిన లాంఛనాలను పూర్తిచేసిన భారత జట్టు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-0 తేడాతో ఈ సిరీస్‌ను కైవసం చేసుకుంది. మరోసారి అద్భుత ప్రదర్శనతో అలరించి 55 పరుగులకే 6 వికెట్లు కూల్చిన భారత స్పిన్ మాంత్రికుడు రవిచంద్రన్ అశ్విన్ ఇంగ్లాండ్ లోయర్ ఆర్డన్‌ను తుత్తునియలు చేయడంతో సోమవారం చివరి రోజు 8 ఓవర్లు మాత్రమే ఆడిన ఇంగ్లాండ్ జట్టు మొత్తం మీద 55.3 ఓవర్లలో 195 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత జట్టు చివరి రోజు ఉదయం కేవలం 34 నిమిషాల్లోనే మిగిలిన లాంఛనాలను పూర్తిచేసి ఇంగ్లాండ్‌ను మట్టికరిపించింది. 6 వికెట్ల నష్టానికి 182 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్ జట్టును గడగడలాడించిన రవిచంద్రన్ అశ్విన్ కేవలం నాలుగు ఓవర్లలో నైట్‌వాచ్‌మన్ జానీ బెయిర్‌స్టో (51)తో పాటు టెయిలెండర్లు క్రిస్ వోక్స్ (0), ఆదిల్ రషీద్ (2), జేమ్స్ ఆండర్సన్ (2)లను పెవిలియన్‌కు చేర్చడంతో భారత్‌కు ఈ అద్భుత విజయం లభించింది. ఈ విజయంతో భారత జట్టు 2012లో కోల్పోయిన ఆంథోనీ డీ మెల్లో ట్రోఫీని ఇంగ్లాండ్ నుంచి మళ్లీ కైవసం చేసుకుంది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు టెస్టు సిరీస్‌లో విజయం సాధించడం ఇది వరుసగా ఐదోసారి. టెస్టు జట్టు కెప్టెన్‌గా కోహ్లీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్రీలంకలో తొలి సిరీస్‌ను గెలుచుకున్న భారత జట్టు ఆ తర్వాత స్వదేశంలో దక్షిణాఫ్రికానూ, వెస్టిండీస్‌లో కరీబియన్లను, స్వదేశంలో నూజిలాండ్ జట్టును ఓడించి టెస్టు సిరీస్‌లను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, తొలి ఇన్నింగ్స్‌లో 400కు పైగా పరుగులు సాధించిన పర్యాటక జట్టు ఓటమిపాలవడం భారత్‌లో ఇదే తొలిసారి.
కుంబ్లేకి చేరువైన అశ్విన్
ఈ మ్యాచ్‌లో మొత్తం 167 పరుగులిచ్చి 12 వికెట్లు (తొలి ఇన్నింగ్స్‌లో 6/112, రెండో ఇన్నింగ్స్‌లో 6/55) కూల్చిన రవిచంద్రన్ అశ్విన్ ఒక టెస్టులో 10 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు కైవసం చేసుకోవడం ఇది ఏడోసారి. దీంతో అతను ఎనిమిదిసార్లు ఈ ఘనత సాధించి అగ్రస్థానంలో నిలిచిన భారత జట్టు ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లే రికార్డును సమం చేసేందుకు అతను కేవలం ఒకే ఒక్క అడుగు దూరంలో నిలిచాడు.

చిత్రం..ముంబయలోని వాంఖడే స్టేడియంలో విరాట్ కోహ్లీ సేన విజయ విహారం