క్రీడాభూమి

నేషనల్ చాంపియన్‌షిప్స్‌లో దేవేంద్రోకి షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గౌహతి, డిసెంబర్ 13: నేషనల్ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో కామనె్వల్త్ క్రీడల రజత పతక విజేత ఎల్.దేవంద్రో సింగ్‌కు అనూహ్యమైన ఎదురుదెబ్బ తగిలింది. రెండుసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొనడంతో పాటు ఆసియా చాంపియన్‌షిప్స్‌లో రజత పతకాన్ని గెలుచుకున్న దేవేంద్రో సింగ్ మంగళవారం ఇక్కడ జరిగిన ఫైనల్ బౌట్‌లో 0-5 తేడాతో చండీగఢ్‌కు చెందిన దీపక్ సింగ్ చేతిలో ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్నాడు. దీంతో నేషనల్ చాంపియన్‌షిప్స్‌లో పాల్గొన్న తొలిసారే దీపక్ సింగ్ పసిడి పతకాన్ని కైవసం చేసుకుని అందరినీ ఆశ్చర్యపర్చగా, దేవేంద్రో సింగ్ రజత పతకంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. కాగా, ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకాన్ని సాధించిన శివ థాపాకు క్వార్టర్ ఫైనల్ బౌట్‌లో గాయమైనప్పటికీ అతను తుది పోరులోనూ మెరిశాడు. మంగళవారం జరిగిన 60 కిలోల లైట్‌వెయిట్ ఫైనల్ బౌట్‌లో అతను 5-0 తేడాతో ఆసియా యూత్ గేమ్స్ రజత పతక విజేత అంకుశ్ దహియా (హర్యానా)ను మట్టికరిపించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. నేషనల్ చాంపియన్‌షిప్స్‌లో శివ థాపా స్వర్ణ పతకాన్ని గెలుచుకోవడం ఇదే తొలిసారి. ఈ పోటీల్లో సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు (ఎస్‌ఎస్‌సిబి) మొత్తం నాలుగు పసిడి పతకాలు, ఒక రజత పతకం, మరో మూడు కాంస్య పతకాలతో ఓవరాల్ టైటిల్‌ను చేజిక్కించుకోగా, రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, మరో రెండు కాంస్యాలతో రైల్వేస్ స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (ఆర్‌ఎస్‌పిబి) రెండో స్థానంలో నిలిచింది.

చిత్రం..శివ థాపా