క్రీడాభూమి

మహిళల బిగ్ బాష్‌లో హర్మన్‌ప్రీత్ మెరుపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్బరీ (ఆస్ట్రేలియా), డిసెంబర్ 13: ఆస్ట్రేలియాలో జరుగుతున్న మహిళల బిగ్ బాష్ లీగ్ (డబ్ల్యుబిబిఎల్) ట్వంటీ-20 టోర్నమెంట్‌లో సిడ్నీ థండర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న టీమిండియా మహిళల టి-20 జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మంగళవారం మెల్బోర్న్ స్టార్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అందరినీ అలరించడంతో పాటు 8 వికెట్ల తేడాతో తమ జట్టుకు అద్భుత విజయాన్ని అందించింది. ఈ టోర్నీలో ఇంతకుముందు తొలి మ్యాచ్‌లో 28 బంతుల్లోనే 47 పరుగులతో మెరిసిన హర్మన్‌ప్రీత్ ఇప్పుడు మెల్బోర్న్ స్టార్స్‌తో జరిగిన పోరులో కూడా అదే జోరును కొనసాగించి 27 పరుగులకే 4 వికెట్లు కైవసం చేసుకోవడంతో పాటు 21 బంతుల్లో 30 పరుగులు సాధించి అజేయంగా నిలిచింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన మెల్బోర్స్ స్టార్స్‌పై హర్మన్‌ప్రీత్ కౌర్ నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడి 16వ ఓవర్‌లో జెస్ కామెరాన్ (36)ను, 18వ ఓవర్‌లో లిలీ బ్రాడ్స్‌లీ (2)ని, చివరి ఓవర్‌లో కాటీ మాక్ (0)తో పాటు డేనియల్ హాజెల్ (5)ను పెవిలియన్‌కు చేర్చింది. దీంతో మెల్బోర్న్ స్టార్స్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 116 పరుగులు సాధించగా, అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సిడ్నీ థండర్స్ జట్టులో ఓపెనర్ రాచెల్ హెయిన్స్ 35 పరుగులు, స్ట్ఫోనీ టేలర్ 29 పరుగులు సాధించి నిష్క్రమించగా, కెప్టెన్ అలెక్స్ బ్లాక్‌వెల్ (23 బంతుల్లో 21 పరుగులు), హర్మన్‌ప్రీత్ కౌర్ (21 బంతుల్లో 30 పరుగులు) అజేయంగా నిలిచి మిగిలిన పని పూర్తి చేశారు. దీంతో 18.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 121 పరుగులు సాధించిన సిడ్నీ థండర్స్ జట్టు మరో 7 బంతులు మిగిలి ఉండగానే 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంలో కీలకపాత్ర పోషించిన హర్మన్‌ప్రీత్ కౌర్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును కైవసం చేసుకుంది.