క్రీడాభూమి

షెడ్యూలు ప్రకారమే భారత్-ఇంగ్లాండ్ టెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 13: తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో సోమవారం సాయంత్రం వార్ధా తుపాను పెను విధ్వంసాన్ని సృష్టించినప్పటికీ చెపాక్‌లో ఈ నెల 16వ తేదీన భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన ఐదవ, చివరి టెస్టు క్రికెట్ మ్యాచ్ షెడ్యూలు ప్రకారమే ప్రారంభం కానుంది. తమిళనాడు క్రికెట్ సంఘం (టిఎన్‌సిఎ) కార్యదర్శి కాశీ విశ్వనాథ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనున్న చిదంబరం స్టేడియంలోని పిచ్‌లోని మధ్య భాగంతో పాటు ఔట్‌ఫీల్డ్‌కు నష్టం వాటిల్లకపోయినప్పటికీ ఈ తుపాను వలన స్టేడియంలోని సైట్‌స్క్రీన్ తీవ్రంగా ధ్వంసమైందని, అలాగే ఫ్లడ్‌లైట్ల బల్బులు పగిలిపోవడంతో పాటు అనేక ఎయిర్‌కండిషనర్లకు నష్టం వాటిల్లిందని, వీటన్నింటినీ రానున్న రెండు రోజుల్లో సరిదిద్దాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ‘వార్ధా తుపాను వలన చిదంబరం స్టేడియంలోని పిచ్‌కు నష్టం వాటిల్లకపోవడం సంతోషకరమైన విషయం. కానీ ఈ తుపాను ధాటికి స్టేడియంలోని సైట్‌స్క్రీన్‌కు తీవ్ర నష్టం వాటిల్లింది. అలాగే ఫ్లడ్‌లైట్ల బల్బులు పగిలిపోవడంతో పాటు ఎయిర్‌కండిషనర్లు ధ్వంసమయ్యాయి. స్టేడియంకు వెళ్లే మార్గంలో అనేక చెట్లు నేలకొరిగి రోడ్డుపై పడి ఉన్నాయి. కనుక రానున్న రెండు రోజుల్లో మేము పరిస్థితులను చక్కదిద్దాల్సిన అవసరం ఉంది. ఆ పనులు సకాలంలో పూర్తవుతాయని నేను గట్టిగా విశ్వసిస్తున్నా’ అని మంగళవారం ఆయన పిటిఐ వార్తా సంస్థకు వివరించారు.