క్రీడాభూమి

చిదంబరం పిచ్ రెడీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: వార్ధా తుపాను కారణంగా చెన్నై నగరం అతలాకుతలమైనప్పటికీ, ఎంఎ చిదంబరం స్టేడియానికి పెద్ద నష్టమేమీ జరగలేదు. భారత్, ఇంగ్లాండ్ చివరి టెస్టుకు ఆతిథ్యమిస్తున్న ఈ స్టేడియంలో అవుట్ ఫీల్డ్‌కు వచ్చిన సమస్య ఏమీ లేదని అధికారులు ప్రకటించారు. పిచ్‌పై తేమ బాగా ఉండడంతో, నీటిని తుడిచేయానికి నిప్పుల కొలుములను ఉపయోగించిన విషయం తెలిసిందే. స్టేడియం బయట కూలిపోయిన బారికేడ్స్‌ను యుద్ధ ప్రాతిపదికపై సరి చేస్తున్నారు. కూలిపోయిన చెట్టును తొలగించే పని పూర్తయింది. వర్షం నీరు మైదానంలో ఎక్కడా నిలవకుండా, ప్రత్యేక ఏర్పాట్లు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్న స్టేడియాల్లో చిదంబరం స్టేడియం కూడా ఒకటి. కాబట్టి అవుట్ ఫీల్డ్‌తో ఎలాంటి సమస్య ఉండదని అధికారులు ధీమాతో ఉన్నారు. పిచ్‌పై నీరు లేకపోయినప్పటికీ, తడి ఎక్కువగా ఉంటే, మొదటి సెషన్‌లో బంతి ఏ విధంగా బౌన్స్ అవుతుందో, ఏ దిశగా దూసుకెళుతుందో చెప్పలేని పరిస్థితి. అయతే, పిచ్ టెస్టుకు అనుకూలంగా ఉంటుందని క్యూరేటర్ విశ్వనాథన్ అంటున్నాడు.

చిత్రం..భారత్, ఇంగ్లాండ్ మధ్య చివరి, ఐదో టెస్టు మ్యాచ్‌కి ముస్తాబవుతున్న చెన్నైలోని ఎంఎ చిదంబరం స్టేడియం