క్రీడాభూమి

సెమీస్‌కు సింధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, డిసెంబర్ 16: రియో ఒలింపిక్స్ మహిళల బాడ్మింటన్ ఫైనల్‌లో కరోలినా మారిన్ చేతిలో ఎదురైన ఓటమికి భారత స్టార్, తెలుగు తేజం పివి సింధు ప్రతీకారం తీర్చుకుంది. ఇక్కడ జరుగుతున్న బాడ్మింటన్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నమెంట్‌లో చివరిదైన మూడో గ్రూప్ మ్యాచ్‌లో మారిన్‌ను 21-17, 21-13 తేడాతో చిత్తుచేసి సెమీస్ చేరింది. కాగా, మారిన్ వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ పరాజయాలను చవిచూసి, టోర్నీ నుంచి నిష్క్రమించింది. అంతకు ముందు సన్ యూ, అనాకే యమాగూచీలతో తలపడి ఓటమిపాలైన మారిన్, తన చివరి మ్యాచ్‌లో సింధుకు గట్టిపోటీనిచ్చే ప్రయత్నం చేసింది. మొదటి సెట్‌లో కొద్దోగొప్పో పోరాటాన్ని కొనసాగించింది. కానీ, ఆ సెట్ చేజారడంతో డీలాపడిపోయిన ఆమె రెండో సెట్‌ను పెద్దగా పోరాడకుండానే సింధుకు సమర్పించుకుంది. కాగా, మరో మ్యాచ్‌లో సన్ యూ 15-21, 21-10, 21-10 ఆధిక్యంతో అకానే యమాగూచీపై విజయం సాధించి సెమీస్‌లోకి అడుగుపెట్టింది. గ్రూప్ ‘ఎ’ నుంచి సంగ్ జీ హ్యున్, తై జూ ఇంగ్ కూడా సెమీస్‌లో స్థానం సంపాదించారు.