క్రీడాభూమి

లియామ్ డాసన్ రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఇంగ్లాండ్ తరఫున కెరీర్‌లో తొలి టెస్టు ఆడుతూ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా లియామ్ డాసన్ రికార్డు సృష్టించాడు. అతను 66 పరుగులతో నాటౌట్‌గా నిలిచి, చరిత్ర పుటల్లో చోటు సంపాదించాడు. 1979లో డేవిడ్ బెయిర్‌స్టో 59 పరుగులతో నెలకొల్పిన రికార్డును డాసన్ బద్దలు చేశాడు.ఈ సిరీస్‌లో ఎనిమిదో వికెట్‌కు ఇప్పటి వరకూ సగటున 48.76 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. టెస్టు క్రికెట్ చరిత్రలో ఈ వికెట్‌కు ఇది కొత్త రికార్డుకాగా, అన్ని వికెట్లను పరిగణలోకి తీసుకుంటే రెండో స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఈ మ్యాచ్‌లో, ఇంగ్లాండ్ ఆటగాళ్లు లియామ్ డాసన్, అదిల్ రషీద్ ఎనిమిదో వికెట్‌కు 108 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. అంతకు ముందు ముంబయి టెస్టులో విరాట్ కోహ్లీ, జయంత్ యాదవ్ ఇదే వికెట్‌కు 241 పరుగుల పార్ట్‌నర్‌షిప్ సాధించారు.
* భారత్‌లో టెస్టులు ఆడుతూ, ఎనిమిదో వికెట్‌కు నెలకొల్పిన అత్యధిక భాగస్వామ్యం రికార్డుల జాబితాలో డాసన్, అదిల్ సాధించిన 108 పరుగుల పార్ట్‌నర్‌షిప్ మూడో స్థానాన్ని ఆక్రమించింది. 1974లో వెస్టిండీస్ క్రికెటర్లు వివియన్ రిచర్డ్స్, కీత్ బాయిస్ ఎనిమిదో వికెట్‌కు చేసిన 124 పరుగుల భాగస్వామ్యం ఈ జాబితాలో మొదటిది. 1987లో ఇదే పిచ్‌పై పాకిస్తాన్‌కు ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రం 112 పరుగులు జోడించారు. ఈ రెండు భాగస్వామ్యాల తర్వాతి స్థానం డాసన్, రషీద్ శనివారం జత చేసిన స్కోరుకు దక్కుతుంది.
* ఇంగ్లాండ్ తరఫున తొలి టెస్టు ఆడుతూ, ఎనిమిది లేదా అంతకంటే తక్కువ స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగి, ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా డాసన్ రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. 1994లో ఓల్ట్ ట్రాఫోర్డ్ మైదానంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో డారెన్ గాఫ్ తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్ చేసి, 65 పరుగులు సాధించాడు. ఆ స్కోరును డాసన్ అధిగమించాడు. కాగా, కెరీర్‌లో తొలి టెస్టులోనే అర్ధ శతకాన్ని సాధించిన ఎనిమిదో ఇంగ్లాండ్ ఆటగాడిగా డాసన్ పేరు చరిత్ర పుస్తకాల్లో చేరింది.

చిత్రం..లియామ్ డాసన్
(66 నాటౌట్)