క్రీడాభూమి

అశ్విన్ విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తొలి ఇన్నింగ్స్‌లో 44 ఓవర్లు బౌల్ చేసి, 151 పరుగులు సమర్పించుకొని కేవలం ఒక వికెట్ తీశాడు. అతను ఈ విధంగా ఒకే టెస్టు ఇన్నింగ్స్‌లో 150 లేదా అంతకంటే ఎక్కువ పరుగులిచ్చి, మూడు లేదా అంతకంటే తక్కువ వికెట్లు పడగొట్టడం ఇది ఐదోసారి. కాగా, ఇప్పుడు సొంత గడ్డపై అశ్విన్ విఫలం కావడం అభిమానులను నిరాశకు గురి చేస్తున్నది.
* చెన్నైలోని ఎంఎ చిదంబరం స్టేడియంలో ఇప్పటి వరకూ జరిగిన టెస్టుల్లో మొదటి ఇన్నింగ్స్‌లో 400 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు సాధించిన విదేశీ జట్టు ఏదీ పరాజయాన్ని ఎదుర్కోలేదు. మోయిన్ అలీ అద్భుత బ్యాటింగ్ ప్రతిభ ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 477 పరుగుల భారీ స్కోరును అందించింది. అతను 262 బంతులు ఎదుర్కొని, 13 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 146 పరుగులు చేశాడు. ఇంతకు ముందు ఈ స్టేడియంలో ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లు చెరి రెండు పర్యాయాలు తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వందలకుపైగా పరుగులు సాధించి, ఆతర్వాత విజయాలను నమోదు చేశాయి. ఆస్ట్రేలియా ఒకసారి మొదటి ఇన్నింగ్స్‌లో నాలుగు వందల పరుగుల మైలురాయిని దాటింది. అయితే, మ్యాచ్ టై అయింది. మొత్తం మీద చిదంబరం స్టేడియంలో మొదటి ఇన్నింగ్స్‌లో నాలుగు వందలకుపైగా పరుగులు చేసిన విదేశీ జట్టు ఇంత వరకూ ఓటమిపాలు కాలేదు. ఇంగ్లాండ్ ఏం చేస్తుందో చూడాలి.
* భారత్‌లో మ్యాచ్ ఆడుతున్నప్పుడు, ఒక జట్టులో ఎనిమిది లేదా అంతకంటే తక్కువ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ఇద్దరు బ్యాట్స్‌మెన్ అర్ధ శతకాలను నమోదు చేయడం ఇది రెండోసారి. 1987 చెన్నై టెస్టులో పాకిస్తాన్ ఆటగాళ్లు ఇమ్రాన్ ఖాన్ 135, వసీం అక్రం 62 చొప్పున పరుగులు చేశారు. ఆతర్వాత ఆయా స్థానాల్లో హాఫ్ సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా డాసన్, రషీద్ గుర్తింపు సంపాదించారు.

చిత్రం..రవిచంద్రన్ అశ్విన్