క్రీడాభూమి

ఇంగ్లాండ్ 477 ఆలౌట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, డిసెంబర్ 17: కెరీర్‌లో తొలి టెస్టు మ్యాచ్ ఆడుతున్న లియామ్ డాసన్, స్పిన్నర్ అదిల్ రషీద్ అర్ధ శతకాలతో రాణించడంతో, భారత్‌తో జరుగుతున్న ఐదవ, చివరి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 477 పరుగుల భారీ స్కోరు సాధించి ఆలౌటైంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్లకు 284 పరుగులు చేసిన ఈ జట్టు శనివారం ఉదయం ఆటను కొనసాగించి ఐదో వికెట్‌గా బెన్ స్టోక్స్‌ను కోల్పోయింది. అతను ఆరు పరుగులు చేసి, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ పార్థీవ్ పటేల్ అద్భుతమైన క్యాచ్ అందుకోగా అవుటయ్యాడు. అనంతరం మోయిన్ అలీతో కలిసిన జొస్ బట్లర్ (5) జట్టు స్కోరును 300 పరుగుల మైలురాయికి చేర్చాడు. ఆ వెంటనే అతను ఇశాంత్ శర్మ బౌలింగ్‌లో ఎల్‌బిగా అవుటయ్యడు. మొదటి రోజు శతకంతో కదంతొక్కిన మోయిన్ అలీ 146 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద ఉమేష్ యాదవ్ బౌలింగ్‌లో రవీంద్ర జడేజా క్యాచ్ పట్టగా పెవిలియన్ చేరాడు. అలీ వికెట్ కూలిన తర్వాత ఇంగ్లాండ్ ఇన్నింగ్స్‌కు సులభంగానే తెరపడుతుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ, డాసన్, రషీద్ కలిసి భారత బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్నారు. పరుగులను రాబడుతూ, స్కోరును ముందుకు తీసుకెళ్లారు. వీరి భాగస్వామ్యంలోనే ఇంగ్లాండ్ 400 పరుగుల మైలురాయిని అధిగమించింది. 60 పరుగులు సాధించిన రషీద్‌ను పార్థీవ్ పటేల్ క్యాచ్ అందుకోగా, ఉమేష్ యాదవ్ అవుట్ చేశాడు. స్టువర్ట్ బ్రాడ్ 19 పరుగులు చేసి రనౌట్‌కాగా, 12 పరుగులు చేసిన జాక్ బాల్‌ను అమిత్ మిశ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. దీనితో 477 పరుగుల వద్ద ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌కు తెరపడింది. అప్పటికి డాసన్ 66 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు పడగొట్టగా, ఉమేష్ యాదవ్, ఇశాంత్ శర్మ చెరి రెండు వికెట్లు సాధించారు. అశ్విన్, అమిత్ మిశ్రా చెరొక వికెట్ తీశారు.
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత మొదటి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్ ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టం లేకుండా 60 పరుగులు చేసింది. ఓపెనర్ మురళీ విజయ్ గాయపడడంతో, లోకేష్ రాహుల్‌తో కలిసి పార్థీవ్ పటేల్ ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. రాహుల్ 30, పార్థీవ్ పటేల్ 28 పరుగులతో ఆడుతున్నారు.
స్కోరుబోర్డు
ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్: అలస్టర్ కుక్ సి విరాట్ కోహ్లీ బి రవీంద్ర జడేజా 10, కీటన్ జెన్నింగ్స్ సి పార్థీవ్ పటేల్ బి ఇశాంత్ శర్మ 1, జో రూట్ సి పార్థీవ్ పటేల్ బి రవీంద్ర జడేజా 88, మోయిన్ అలీ సి రవీంద్ర జడేజా బి ఉమేష్ యాదవ్ 146, జానీ బెయిర్‌స్టో సి లోకేష్ రాహుల్ బి రవీంద్ర జడేజా 49, బెన్ స్టోక్స్ సి పార్థీవ్ పటేల్ బి అశ్విన్ 6, జొస్ బట్లర్ ఎల్‌బి ఇశాంత్ శర్మ 5, లియామ్ డాసన్ 66 నాటౌట్, అదిల్ రషీద్ సి పార్థీవ్ పటేల్ బి ఉమేష్ యాదవ్ 60, స్టువర్ట్ బ్రాడ్ 19 రనౌట్, జాక్ బాల్ బి అమిత్ మిశ్రా 12, ఎక్‌స్ట్రాలు 15, మొత్తం (157.2 ఓవర్లలో ఆలౌట్) 477.
వికెట్ల పతనం: 1-7, 2-21, 3-167, 4-253, 5-287, 6-300, 7-321, 8-429, 9-455, 10-477.
బౌలింగ్: ఉమేష్ యాదవ్ 21-3-73-2, ఇశాంత్ శర్మ 21-6-42-2, రవీంద్ర జడేజా 45-9-106-3, రవిచంద్రన్ అశ్విన్ 44-3-151-1, అమిత్ మిశ్రా 25.2-5-87-1, కరుణ్ నాయర్ 1-0-4-0.
భారత్ మొదటి ఇన్నింగ్స్: లోకేష్ రాహుల్ 30 నాటౌట్, పార్థీవ్ పటేల్ 28 నాటౌట్, ఎక్‌స్ట్రాలు 2, మొత్తం (20 ఓవర్లలో వికెట్ నష్టం లేకుండా) 60.
బౌలింగ్: స్టువర్ట్ బ్రాడ్ 5-2-6-0, జాక్ బాల్ 3-0-9-0, మోయిన్ అలీ 7-1-18-0, బెన్ స్టోక్స్ 2-0-12-0, అదిల్ రషీద్ 2-0-13-0, లియామ్ డాసన్ 1-1-0-0.

చిత్రం..మూడు వికెట్లు పడగొట్టిన రవీంద్ర జడేజా