క్రీడాభూమి

టైటిళ్లపైనే నా గురి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: వచ్చే ఏడాది కూడా వివిధ స్థాయి పోటీల్లో ఎక్కువ టైటిళ్లు సాధించడంపైనే తాను గురిపెట్టానని, కాబట్టి ప్రత్యర్థి ఎవరనే విషయాన్ని పట్టించుకోబోనని భారత ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్ స్పష్టం చేశాడు. ఫ్రాన్సిస్ చెకాతో జరిగిన ఫైట్‌ను కేవలం పది నిమిషాల్లోనే విజయం సాధించిన విజేందర్ డబ్ల్యుబివో ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్‌వెయిట్ టైటిల్‌ను స్వీకరించాడు. ఈ సందర్భంగా అతను పిటిఐతో మాట్లాడుతూ వచ్చే ఏడాది కామనె్వల్త్ సూపర్ మిడిల్‌వెయిట్ విభాగంలో టైటిల్ కోసం పోరాడే అవకాశాలున్నాయన్నాడు. చెకాతో ఫైట్ స్వదేశంలో జరిగిందని, అయితే, ప్రొఫెషనల్‌గా మారిన తర్వాత తాను పోటీ ఎక్కడ జరుగుతున్నదనే విషయాన్ని తాను పట్టించుకోబోనని అన్నాడు. ప్రస్తుతం కామనె్వల్త్ సూపర్ మిడిల్ వెయిట్ విభాగంలో ల్యూక్ బ్లాకెడ్జి (బ్రిటన్) చాంపియన్‌గా కొనసాగుతున్నాడు. అతను ఇప్పటి వరకూ 27 ఫైట్స్‌లో పాల్గొని 22 విజయాలు సాధించాడు. రెండు ఫైట్స్‌లో ఫలితం తేలలేదు. మూడు ఫైట్స్‌ను కోల్పోయాడు. అతనితో పోరుకు సిద్ధమా అన్న ప్రశ్నకు విజేందర్ స్పందిస్తూ, ప్రత్యర్థి ఎవరన్నది తనకు ప్రధానం కాదని అన్నాడు. వచ్చే ఏడాది సాధ్యమైనన్ని ఎక్కు వ ఫైట్స్‌లో పాల్గొని, దేశానికి టైటిళ్లను అందించడమే తన లక్ష్యమని అన్నాడు. అందుకోసం తన శ క్తి వంచన లేకుండా శ్రమిస్తానని చెప్పాడు.
ఇలావుంటే, ప్రొఫెషనల్ బాక్సర్‌గా అవతరించిన తర్వాత విజేందర్‌కు ఇది వరుసగా ఎనిమిదో నాకౌట్ విజయం. నిరుడు అతను మూడు ఫైట్స్‌లో పాల్గొన్నాడు. అక్టోబర్ 10న సోనీ వైటింగ్‌ను, జూలై 11న డియాన్ గిలెన్‌ను, డిసెంబర్ 19న సమెట్ హ్యుసెనోవ్‌ను చిత్తుచేశాడు. ఈ మూడు నాకౌట్ విజయాలే. ఈఏడాది మార్చి 12న అలెగ్జాండర్ హోర్వర్త్, ఏప్రిల్ 30న మాటియోగ్ రాయర్, మే 13న ఆండ్రెజ్ సొల్డ్రా, జూలై 16న కెర్రీ హోప్‌లపై నాకౌట్ విజయాలను నమోదు చేశాడు. తాజాగా ఫ్రాన్సిస్కా చెకాను ఓడించి, ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్‌వెయిట్ టైటిల్‌ను సాధించాడు.