క్రీడాభూమి

నర్వస్ నైన్టీస్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: టెస్టుల్లో 90 పరుగులు సాధించిన తర్వాత సెంచరీ పూర్తి చేయలేకపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. అదే విధంగా 190 పరుగులు దాటిన తర్వాత డబుల్ సెంచరీని అందుకోవడంలో విఫలమైన వారూ ఉన్నారు. ఎక్కువ పరుగుల తేడాతో సెంచరీ లేదా డబుల్ సెంచరీని కోల్పోవడం ఒక ఎత్తయితే, కేవలం ఒక పరుగు తేడాతో ఈ మైలురాయిని చేరుకోలేకపోవడం మరో ఎత్తు. బ్యాట్స్‌మెన్‌ను తీవ్ర నిరాశకు గురి చేసే ఇలాంటి అరుదైన సంఘటన భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య చెన్నైలోని చిదంబరం స్టేడియం జరుగుతున్న చివరి, ఐదో టెస్టు మ్యాచ్, మూడో రోజు ఆటలో చోటు చేసుకుంది. భారత ఓపెనర్ లోకేష్ రాహుల్ 199 పరుగులు సాధించి, ఒక పరుగు తేడాతో డబుల్ సెంచరీని కోల్పోయిన ఆటగాళ్ల జాబితాలో తొమ్మిదో బ్యాట్స్‌మన్‌గా చేరాడు. 1984లో భారత్‌తో ఫైసలాబాద్‌లో జరిగిన టెస్టులో ముదస్సర్ నజర్ మొట్టమొదటిసారి 199 పరుగులకు అవుటయ్యాడు. ఇంత వరకూ రాహుల్ సహా మొత్తం తొమ్మిది మంది బ్యాట్స్‌మెన్ పరుగు తేడాతో డబుల్ సెంచరీని చేజార్చుకున్నాడు. 1986లో అజరుద్దీన్ తర్వాత ఒక భారత ఆటగాడు ఈ విధంగా పరుగు తేడాతో డబుల్ సెంచరీ మైలురాయిని చేరుకోలేకపోవడం ఇదే మొదటిసారి.
టెస్టుల్లో 199 పరుగులకు అవుటైన
బ్యాట్స్‌మెన్ వీరే..
1. ముదస్సర్ నజర్ (పాకిస్తాన్/ 1984 అక్టోబర్ 24న/ ఫైసలాబాద్ టెస్టులో భారత్‌పై), 2. మహమ్మద్ అజరుద్దీన్ (్భరత్/ 1986 డిసెంబర్ 17న/ కాన్పూర్‌లో శ్రీలంకపై), 3. మాథ్యూ ఇలియట్ (ఆస్ట్రేలియా/ 1997 జూలై 24న/ లీడ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌పై), 4. సనత్ జయసూర్య (శ్రీలంక/ 1997 ఆగస్టు 9న/ కొలంబోలో భారత్‌పై), 5. స్టీవ్ వా (ఆస్ట్రేలియా/ 1999 మార్చి 26న/ బ్రిడ్జిటౌన్‌లో వెస్టిండీస్‌పై), 6. యూనిస్ ఖాన్ (పాకిస్తాన్/ 2006 జనవరి 13న/ లాహోర్‌లో భారత్‌పై) 7. ఇయాన్ బెల్ (ఇంగ్లాండ్/ 2008 జూలై 10న/ లార్డ్స్‌లో దక్షిణాఫ్రికాపై), 8. స్టీవెన్ స్మిత్ (ఆస్ట్రేలియా/ 2015 జూన్ 11న/ కింగ్‌స్టన్‌లో వెస్టిండీస్‌పై), 9. లోకేష్ రాహుల్ (్భరత్/ 2016 డిసెంబర్ 18న/ చెన్నైలో ఇంగ్లాండ్‌పై).