క్రీడాభూమి

గవాస్కర్ తర్వాత..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై: ఇంగ్లాండ్‌పై ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు సాధించిన భారత బ్యాట్స్‌మెన్ జాబితాలో సునీల్ గవాస్కర్ తర్వాతి స్థానాన్ని లోకేష్ రాహుల్ దక్కించుకున్నాడు. 1979 ఆగస్టు 30న, ది ఓవల్ మ్యాచ్‌లో గవాస్కర్ 221 పరుగులు చేశాడు. తాజా ఇన్నింగ్స్‌లో రాహుల్ 199 పరుగులు సాధించాడు. 1964 జనవరి 10న చెన్నైలోనే బుధీ కుందరన్ 192 పరుగులు చేసి అవుటయ్యాడు. ఇంగ్లాండ్‌పై 190 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్ ఈ ముగ్గురే.
భారత్‌లో ఐదు టెస్టు ఇన్నింగ్స్‌లో రాహుల్ చేసిన అత్యధిక స్కోరు 38 పరుగులు. ఆరో ఇన్నింగ్స్‌లో 199 పరుగులు సాధించడం ద్వారా అతను తన కెరీర్‌లోనే అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేశాడు. అంతకు ముందు ఐదు టెస్టుల్లో కలిపి అతను చేసిన మొత్తం పరుగులు 104 (సగటు 20.80 పరుగులు).
టీమిండియా ఓపెనర్లు ఇద్దరూ ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో కనీసం అర్ధ శతకం సాధించడం 2011 నుంచి ఇప్పటి వరకూ ఇది నాలుగోసారి. చివరిసారి నిరుడు జూన్ మాసంలో బంగ్లాదేశ్‌పై భారత ఓపెనర్లు ఇదే విధంగా కనీసం హాఫ్ సెంచరీ నమోదు చేశారు. కాగా, 31 ఇన్నింగ్స్ తర్వాత టీమిండియా మొదటిసారి తొలి వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని నమోదు చేయగలిగింది.

చిత్రం..అవుటైన వెంటనే నిరాశతో పిచ్‌పై కూలబడిపోయన లోకేష్ రాహుల్