క్రీడాభూమి

సమష్టి కృషితోనే టైటిల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొచ్చి, డిసెంబర్ 19: ఆటగాళ్లంతా సమష్టిగా కృషి చేసి, సర్వశక్తులు ఒడ్డడం వల్లే ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) టైటిల్‌ను గెల్చుకోగలిగామని అట్లెటికో డి కోల్‌కతా కోచ్ జొస్ ఫ్రాన్సిస్కో మోలినా అన్నాడు. 2014లో తొలి ఐఎస్‌ఎల్ టోర్నీ ఫైనల్‌లో కేరళ బ్లాస్టర్స్‌ను 1-0 తేడాతో ఓడించి టైటిల్‌ను అట్లెటికో కోల్‌కతా గెల్చుకుంది. 2015లో చెనె్నయిన్ విజేతగా అవతరించింది. ఫైనల్‌లో గోవాను ఆ జట్టు 3-2 తేడాతో ఓడించింది. కాగా, ఈసారి మరోసారి అట్లెటికో కోల్‌కతా, కేరళ బ్లాస్టర్స్ జట్లు ఢీ కొన్నాయి. నిర్ణీత సమయానికి ఇరు జట్లు చెరొక గోల్‌తో సమవుజ్జీలుగా నిలవడంతో, పెనాల్టీ షూటౌట్ అనివార్యమైంది. అందులో అట్లెటికో కోల్‌కతా నాలుగు గోల్స్ చేయగా, కేరళ బ్లాస్టర్స్ మూడు గోల్స్ చేసి, రన్నరప్ ట్రోఫీకి పరిమితమైంది. రెండోసారి అట్లెటికో టైటిల్‌ను సాధించడంపై కోచ్ మోలినా హర్షం వ్యక్తం చేశాడు. ఈ విజయం జట్టులోని ప్రతి సభ్యుడికీ దక్కుతుందని వ్యాఖ్యానించాడు. అభిమానుల చంనాలకు తగినట్టు ఆడామని అంటూ, వారి అండదండలు, మద్దతు తమ విజయంలో కీలక పాత్ర పోషించిందని అన్నాడు. అట్లెటికో కోల్‌కతాను పటిష్టమైన జట్టుగా తయారు చేయడానికి నిర్విరామ కృషి జరుగుతున్నదని చెప్పాడు. ఆటగాళ్లు కూడా సహకరిస్తున్నారని అన్నాడు.

చిత్రం..అట్లెటికో కోల్‌కతా కోచ్ జొస్ ఫ్రాన్సిస్కో మోలినా