క్రీడాభూమి

ఐపిఎల్ వేలానికి ఇశాంత్ రిలీజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 19: వచ్చే ఏడాది జరిగే ఐపిఎల్ వేలానికి అందుబాటులో ఉండేందుకు జాతీయ క్రికెటర్ ఇశాంత్ శర్మను రైజింగ్ పుణే సూపర్‌జెయింట్స్ ఫ్రాంచైజీ రిలీజ్ చేసింది. ప్రతి ఫ్రాంచైజీ వేలానికి ముందు కొంత మంది ఆటగాళ్ల కొనసాగిస్తూ, మరి కొంత మందిని వేలం కోసం రిలీజ్ చేస్తారు. పుణే ఈసారి రిలీజ్ చేసిన ఆటగాళ్లలో ఇశాంత్ పేరు ఉంది. గత ఏడాది ఆ ఫ్రాంచైజీ అతనిని 3.8 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. కాగా, ఇంగ్లాండ్ బ్యాటింగ్ స్టార్ కెవిన్ పీటర్సన్‌ను కూడా పుణే వదులుకుంది. నిరుడు పీటర్సన్ కోసం పుణే 3.5 కోట్ల రూపాయలు చెల్లించింది. ఈ ఫ్రాంచైజీ మొత్తం 11 మంది ఆటగాళ్లను రిలీజ్ చేయడం గమనార్హం. దక్షిణాఫ్రికా సూపర్ బౌలర్ డేల్ స్టెయిన్‌ను గుజరాత్ లయన్స్ ఫ్రాంచైజీ వద్దనుకుంది. చేతి గాయంతో ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న సెయిన్‌ను నిరుడు గుజరాత్ 2.5 కోట్ల రూపాయలకు కొనింది. ఇలావుంటే, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 10, కోల్‌కతా నైట్ రైడర్స్ 9 మంది ఆటగాళ్లను రిలీజ్ చేశాయి. నిరుడు అత్యధికంగా 8.5 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిన పవన్ నేగీని ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు వదిలేసింది. జాసన్ హోల్డర్, కొలిన్ మున్రో, జాన్ హాస్టింగ్స్, బ్రాడ్ హాగ్, మోర్న్ మోర్కెట్‌లను కోల్‌కతా జట్టు వదిలేసింది. ట్రెంట్ బౌల్ట్, ఆశిష్ రెడ్డి, ఇయాన్ మోర్గాన్‌లకు సన్‌రైజర్స్ హైదరాబాద్ గుడ్‌బై చెప్పింది. ఈ విధంగా ఆయా ఫ్రాంచైజీల నుంచి రిలీజైన మేటి ఆటగాళ్లలో మిచెల్ జాన్సన్ (కింగ్స్ ఎలెవెన్ పంజాబ్), కోరీ ఆండర్సన్, మార్టిన్ గుప్టిల్ (ముంబయి ఇండియన్స్), నాథన్ కౌల్టన్ నైల్ (్ఢల్లీ డేర్ డెవిల్స్) కూడా ఉన్నారు.
ఇలావుంటే, 44 మంది విదేశీయులుసహా సుమారు 140 మంది ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు రీటైన్ చేశాయి. తమతమ జట్లకు వచ్చే ఏడాది కూడా ప్రాతినిథ్యం వహించే వారిలో మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, ఆజింక్య రహానే, రవిచంద్రన్ అశ్విన్, స్టీవెన్ స్మిత్, ఫఫ్ డు ప్లెసిస్ తదితరులు ఉన్నారు.
అక్రం దూరం
కోల్‌కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో కోల్‌కతా నైట్ రైడర్స్‌కు బౌలింగ్ కోచ్‌గా, మెంటర్‌గా వ్యవహరిస్తున్న పాకిస్తాన్ లెజెండరీ క్రికెటర్ వసీం అక్రం వచ్చే ఏడాది ఎడిషన్‌కు రావడం లేదు. ఈ విషయంలో నైట్ రైడర్స్ యాజమాన్యం ప్రకటించింది. ముందుగా కుదుర్చుకున్న కొన్ని ఒప్పందాలను అనుసరించి, దాదాపు అదే సమయంలో సేవలు అందించాల్సి అవసరం ఉన్నందునే తాను రాలేనని అక్రం నుంచి సమాచారం వచ్చిందని షారుఖ్ ఒక ప్రకటనలో వివరించింది. 2012, 2014 సంవత్సరాల్లో తాము టైటిల్ సాధించడానికి అక్రం సేవలు కూడా తోడ్పడ్డాయని పేర్కొంది. కాగా, ఐపిఎల్‌లో నైట్ రైడర్స్‌కు మెంటర్‌గా వ్యవహరించే అవకాశం దక్కినందుకు ఎంతో ఆనందించానని, ప్రస్తుతం కొన్ని ముందస్తు ఒప్పందాల కారణంగా వచ్చే ఏడాది ఐపిఎల్ సమయంలో తాను అందుబాటులో ఉండనని అక్రం ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. నైట్ రైడర్స్‌ను పటిష్టమైన జట్టుగా అభివర్ణించిన అతను వచ్చే ఏడాది టైటిల్ ఆ జట్టుకే లభిస్తుందని జోస్యం చెప్పాడు.
ఇలావుంటే, అక్రం నిజంగానే ముందస్తు ఒప్పందాల కారణంగానే ఐపిఎల్‌కు రావడం లేదా లేక భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఆ నిర్ణయం తీసుకున్నాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

చిత్రాలు..ఇశాంత్ శర్మ, అక్రం