క్రీడాభూమి

పోరాడి ఓడిన పాకిస్తాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిస్బేన్, డిసెంబర్ 19: ఆస్ట్రేలియాతో డే/నైట్ ఈవెంట్‌గా జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌లో పాకిస్తాన్ చివరి వరకూ పోరాడినప్పటికీ ఫలితం లేకపోయింది. ఓటమిని అంగీకరించడానికి సిద్ధపడని పాక్ క్రికెటర్లు జట్టును గెలిపించడానికి శక్తివంచన లేకుండా కృషి చేశారు. కానీ, చివరి రోజు ఆట మొదలయ్యే సమయానికి ఎక్కువ వికెట్లు చేతిలో లేకపోవడంతో, 39 పరుగుల తేడాతో పాక్‌కు ఓటపి తప్పలేదు. మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌పై ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యాన్ని సంపాదించింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 429 పరుగులు సాధించగా, అందుకు సమాధానంగా పాకిస్తాన్ మొదటి ఇన్నింగ్స్‌లో 142 పరుగులకే కుప్పకూలింది. 287 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌ను ఐదు వికెట్లకు 202 పరుగుల స్కోరువద్ద డిక్లేర్ చేసింది. దీనితో 490 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన పాకిస్తాన్‌కు అసద్ షఫీక్ అండగా నిలిచి సెంచరీతో ఆదుకున్నాడు. అతని ప్రతిభ కారణంగా, నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్తాన్ ఎనిమిది వికెట్లకు 382 పరుగులు సాధించింది. ఈ ఓవర్‌నైట్ స్కోరుతో ఆటను కొనసాగించి, 449 పరుగుల వద్ద షఫీక్ వికెట్‌ను కోల్పోయింది. అతను 207 బంతులు ఎదుర్కొని, 13 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 137 పరుగులు చేసి మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో డేవిడ్ వార్నర్ క్యాచ్ పట్టగా అవుటయ్యాడు. షఫీక్‌కు చక్కటి తోడ్పాటును అందించిన యాసిర్ షా 33 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌటయ్యాడు. దీనితో పాకిస్తాన్ 145 ఓవర్లలో 450 పరుగులకు ఆలౌటైంది. అప్పటికి రహత్ అలీ ఒక పరుగులతో క్రీజ్‌లో ఉన్నాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 119 పరుగులకు నాలుగు వికెట్లు పడగొట్టాడు. బాక్సర్ బర్డ్ 110 పరుగులకు మూడు, నాథన్ లియాన్ 108 పరుగులకు రెండు చొప్పున వికెట్లు సాధించారు.